- బెంజిసర్కిల్, కార్పొరేషన్ నుంచి భారీ ప్రదర్శనలు
- ఏర్పాట్లు పూర్తి : వై వెంకటేశ్వరరావు
సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...
సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి. ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు విప్లవాభివందనాలు...
Monday, August 9, 2010
నేడు బహిరంగ సభ
ప్రదర్శనకు ఇలా చేరుకోవాలి
- బెంజి సర్కిల్ నుండి బయలుదేరే ప్రదర్శన
2. స్రూబ్రిడ్జి వద్ద ప్రదర్శనకారులను దించిన వాహనాలు రామలింగేశ్వరనగర్ ఫీడర్ రోడ్డులో పార్కింగు చేయాలి.
3. కనకదుర్గ వారథి మీదుగా వచ్చే ప్రదర్శకులు బహిరంగసభ అనంతరం సభావేదిక వెనుక రోడ్డులో నుంచి కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా రామలింగేశ్వరనగర్ ఫీడర్ రోడ్డులో నిలిపి ఉన్న వాహనాలు ఎక్కి వెళ్లాలి.
4. బందరురోడ్డులో వచ్చే వాహనాలు ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద ఆపి బెంజి సర్కిల్‌ల్లో జరిగే ప్రదర్శనలో పాల్గొనాలి.
5. వాహనాలను కృష్ణవేణి కాలేజీ, పంట కాలువ రోడ్లలో పార్కింగు చేసుకోవాలి.
6. బందరురోడ్డులో వచ్చిన వారు బహిరంగ సభ అనంతరం బందరురోడ్డు నుండి పంటకాలువ వద్ద ఆపిన వాహనాల్లో ఎక్కి వెళ్లాలి.
7. ఏలూరు రోడ్డు నుండి వచ్చేవారు తమ వాహనాలను గాయత్రినగర్ మైనేనీ టీస్టాల్ వద్ద ఆపి బెంజి సర్కిల్‌కు చేరుకోవాలి.
8. వాహనాలను లయోలా కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డులో నిలుపుకోవాలి.
9. ఏలూరు రోడ్డు వైపు నుండి వచ్చిన ప్రదర్శకులు సభ అనంతరం బందరురోడ్డు నుండి లయోలా కళాశాల వద్దకు చేరుకోవాలి.
మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నుండి బయలుదేరే ప్రదర్శన
1. హైదరాబాద్ రూట్లో గొల్లపూడి మీదుగా వచ్చే వారు తమ వాహనాలను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఆపి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాలి.
2. కుమ్మరిపాలెంలో ప్రదర్శకులను దించిన వాహనాలు విధ్యాధరపురం సెంటర్ మీదుగా టన్నెల్‌లో నుండి చిట్టినగర్ ఎర్రకట్ట మీదుగా బిఆర్‌టిఎస్ రోడ్డులో పార్కింగు చేయాలి.
3. హైదరాబాద్ రూట్లో వచ్చిన ప్రదర్శకులు సభ అనంతరం పోలీసు కమిషనర్ కార్యాలయం మీదుగా డోర్నకల్ రోడ్డు, కొత్తవంతెన దాటి, సాంబమూర్తి రోడ్డు క్రాస్ చేసి సంగీత కళాశాల వద్ద బిఆర్‌టిఎస్ రోడ్డులోకి చేరాలి.
4. నూజివీడు రోడ్డు నుండి వచ్చే వాహనాలను బిఆర్‌టిఎస్ రోడ్డులో పార్కింగు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నుండి బయలుదేరే ప్రదర్శనలో పాల్గొనాలి. వాహనాలను బిఆర్‌టిఎస్ రోడ్డులోనే పార్కింగు చేయాలి.
5. నూజివీడు రోడ్డులో వచ్చిన వారందరూ పోలీసు కమిషనర్ కార్యాలయం, డోర్నకల్ రోడ్డు, కొత్తవంతెన, సాంబమూర్తిరోడ్డు దాటి సంగీత కళాశాల వద్ద బిఆర్‌టిఎస్ రోడ్డులోకి చేరాలి.
తరలి వస్తున్న జనవాహిని
- సోమవారం ఉదయం నుంచే ప్రయాణం
- అరుణపతాకాలతో ఎర్రబారిన రైళ్లు
- విజయవాడకు చేరుకున్న వేలాది ప్రజా రథాలు
విజయవాడ పరిసర ప్రాంతాలయిన తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచే భారీ సంఖ్యలో సభకు ప్రజలు బయలుదేరనున్నారు. ''మాకు గూడు చూపించిన
ఎర్రజెండా పార్టీ సభకు వేకువజామునే రైలెక్కి పోతున్నా'' అంటూ ఏలూరులో
ఖనిజ నిల్వలను జాతీయ సంపదగా ప్రకటించాలి
- అక్రమ మైనింగ్‌పై సమగ్ర దర్యాప్తు
- ఏచూరి డిమాండ్
ముతక బట్టలు ధరించిన ఈయన మంత్రా?
సర్పంచ్‌గా గెలిస్తే చాలు రాయంచ నడక, నాయకత్వ నయగారం ఒలికించే రాజకీయ ప్రబుద్ధులను చూస్తున్న ప్రజలు, ఈ నిరాడంబర మంత్రులనూ, ఎంపీలనూ చూసి ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. ముతక బట్టలు ధరించిన ఈయన మంత్రా?, సాదాసీదాగా ఉన్న ఆయన ఎంపీనా? అంటూ చూపరులు చర్చించుకుంటున్నారు. ఓ ఎమ్మెల్యేగా ఎన్నికైతే చాలు 'రాజువెడలె రవితేజములలరగ' చందంగా పక్కన గన్‌మెన్లు, అనుచరుల హడావుడి, క్వాలీసు వాహనాల కాన్వాయిలతో హోరెత్తించే సంప్రదాయానికి భిన్నంగా నిరాడంబరంగా, నమ్రతగా, అందరినీ పలుకరిస్తూ కదిలివెళ్తున్న పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాలకు చెందిన మార్క్సిస్టు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలను చూసి విజయవాడ నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ఈ మూడు రాష్ట్రాల నుంచి 27 మంత్రులు సిపిఎం జాతీయ విస్తృత సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. వీరు సమావేశ ప్రాంగణమైన తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్దకు వచ్చి వెళ్లే సమయాల్లో తమకు కనిపించినప్పుడు ప్రజలు పై విధంగా చర్చించుకున్నారు.
విప్లవ స్ఫూర్తిని రగిలిస్తున్న అమరవీరుల చిహ్నం
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల సందర్భంగా షహీద్‌నగర్ (తుమ్మలపల్లి కళాక్షేత్రం)లో ఏర్పాటుచేసిన అమరవీరుల చిహ్నం రాబోయే తరాలకు విప్లవ స్ఫూర్తిని అందిస్తోంది. భూమి నుండి వచ్చిన చేయి ఎర్రజెండాను అందిస్తున్నట్లుగా ఉన్న ఈ చిహ్నం చూస్తుంటేనే పోరాట స్ఫూర్తి రగులుతోంది. కర్రతో ఏర్పాటు చేసిన ఈ చిహ్నం మోచేతివరకూ భూమిలో ఉంది. అక్కడ నుండి పైకొచ్చి జెండాను పట్టుకుంది. దీనిపై సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోరాటవీరులు ప్రాణాలర్పించినా భావితరాలకు స్ఫూర్తిని అందిస్తున్నట్లు, భూమిలో కలిసిపోయినా సరే రానున్న తరాలను చైతన్యం చేయాలన్నట్లు ఈ చిహ్నం ఏర్పాటు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి చిహ్నం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారన్నారు. ఈ చిహ్నం చుట్టూ ఏర్పాటు చేసిన పూలు వాడిపోకుండా ఏరోజుకారోజు మారుస్తున్నారు.
ఎందుకంత రహస్యం?
- స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చర్చకు పెట్టాలి : వరదరాజన్ డిమాండ్
చైతన్య దీపికలు ప్రజా కళా సంబరాలు
- జానపదమే జనజీవితంగా ' జజ్జనకరి జనారే'
ఓహౌం బీం' నాటిక ప్రదర్శన కూడా పలువురి మెప్పు పొందింది. చిరకాలం జరిగిన మోసాలు, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు 'ఇంకానా ఇకపై సాగవు' అని సందేశమిచ్చింది. సామ్రాజ్యవాదులు తమ వ్యాపారాలను విస్తృత పరుచుకోవడం ద్వారా లాభాలను దండుకునేందుకు మానవుణ్ణి వినిమయ బానిసగా మార్చేయడానికి ఇడియట్ బాక్స్ (టెలివిజన్)ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నదీ 'విజన్ పాయిజన్' నాటిక సాక్షాత్కరింపచేసింది. తరతరాల తెలుగు భాషా ఔనత్యాన్నీ, విశిష్టతనూ తెలియజెప్పిందీ 'తెలుగు వెలుగు' నాటిక. నాటికలేగాక ఈ నాలుగు రోజులూ కళావేదికపై వైవిధ్యభరిత కళారూపాలు ప్రదర్శితమయ్యాయి.
మహిళలు-సోషలిజం పుస్తకం ఒక్క రోజులోనే 400 కాపీలు అమ్మకం
ఎర్రజెండా నీడలోనే మహిళకు నిజమైన గౌరవం
- బెంగాల్ మహిళా ఉద్యమ మణిపూస శ్యామలీ గుప్తా
అమూల్యం... స్ఫూర్తిదాయకం
- ఫోటో ఎగ్జిబిషన్‌కు విశేష ఆదరణ
కుల గోడలు బద్దలు కొట్టాం
- దళితుల పట్ల 82 రకాల వివక్ష
- ఉద్యమాల వల్ల అరుంధతీయులకు 3 శాతం రిజర్వేషన్లు
- 'తమిళనాడు 'అంటరానితనం నిర్మూలన వేదిక'
- ప్రధాన కార్యదర్శి సంపత్
శ్రీశ్రీ అంటేనే ఉత్తేజం
- సీతారాం ఏచూరి
- మహాకవికి షహీద్‌నగర్‌లో శతజయంతి నివాళి
'పెట్రో' పెంపు, అధిక ధరలపై ఉధృత పోరు
- అస్థిత్వ రాజకీయాలతో ప్రజా సమస్యలు పక్కదారి
- ప్రజాశక్తి ఇంటర్వ్యూలో ప్రకాశ్ కరత్
రేపే భారీ బహిరంగ సభ
- విజయవాడలో విస్తృత ఏర్పాట్లు
- మధ్యాహ్నం 2 గంటలకు ప్రదర్శన
- 3 గంటలకు సభ
లాల్‌గఢ్ ర్యాలీపై ఏం చెబుతారు ?
- కేంద్రాన్ని ప్రశ్నించిన కరత్
- తృణమూల్ - మావోయిస్టుల మైత్రి బహిర్గతం
- అణు ప్రమాదాలకు రియాక్టర్ కంపెనీలదే బాధ్యత
- సవరణలు చేయకుంటే బిల్లును వ్యతిరేకిస్తాం
విద్యాబిల్లుల ఆమోదం రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం
- విజయవాడ సదస్సులో సీతారాం ఏచూరి
ఈ నాలుగు బిల్లుల్లో ఉన్నత విద్యను దెబ్బతీసే అంశాలుఎక్కువగా ఉన్నాయని ఏచూరి అన్నారు. దీనిలో భాగంగా యుజిసి, ఎఐసిటిఇని రద్దుచేసి
స్పందింపజేస్తున్న ఎగ్జిబిషన్
సిపిఎం విస్తృత సమావేశాల సందర్భంగా గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణమండపంలో ఏర్పాటుచేసిన ఫొటోఎగ్జిబిషన్‌కు ఆదివారం ప్రజలు తరలివచ్చారు. వర్లీ, తెభాగ, పున్నప్ర వాయలార్, ఆంధ్రప్రదేశ్‌లో భూపోరాటం వంటి ఘట్టాలతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది. అణుబాంబుల వల్ల కలిగే నష్టాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఏర్పాటు చేసిన అనేక చిత్రపటాలు విద్యార్థులను ఆలోచింపజేస్తున్నాయి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై బాంబు వేసినప్పటి నుండి ఇప్పటి వరకూ అమెరికా చేస్తున్న అనేక దురాగతాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటోలు స్పందింపజేస్తున్నాయి. విద్యార్థులు, యువకులు ఎక్కువగా ఈ ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్నారు. సాయంత్రం కళారూపాలు కూడా ఉండటంతో ఎక్కువమంది ఇక్కడకు చేరుకుంటున్నారు. దీంతో ఎగ్జిబిషన్ ప్రాంగణం, కళారూపాల ప్రాంగణం వీక్షకులతో నిండిపోయంది.
ప్రజా కళాకారులే సమాజ మార్గదర్శకులు
- 'జజ్జనకరిజనారే' లో సినీ దర్శకుడు ఉమామహేశ్వరరావు
రేయింబవళ్లు శ్రమిస్తూ.. అందరి అభిమానమూ చూరగొంటూ...
- విస్తృత సమావేశాల జయప్రదానికి సుశిక్షితులైన 800 మంది వలంటీర్ల సేవలు
Subscribe to:
Posts (Atom)