సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Saturday, March 28, 2009

10 మంది అభ్యర్థులతో సీపీఎం తొలిజాబితా

హైదరాబాద్‌ : ఎన్నికల్లో ఇరవై అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తామంటూ ఆ స్థానాల జాబితాను కూడా విడుదల చేసిన సీపీఎం.. వాటిలో సగం సీట్లకు శుక్రవారం అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ అభ్యర్థుల తొలిజాబితాను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావులు విడుదల చేశారు. మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజు ఇప్పటికే నామినేషన్‌ వేశారని, మిగిలినవారు శని, సోమవారాలలో దాఖలు చేస్తారని చెప్పారు. వైరా, వరంగల్‌ తూర్పు, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ఉప్పల్‌, గాజువాక, ఆచంట, మంగళగిరి, నెల్లూరు గ్రామీణ, అనంతపురం అసెంబ్లీ స్థానాలపై తెదేపాతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇవి ఫలప్రదమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మహాకూటమిలోని నాలుగు పార్టీల మధ్య వివాదం లేని సీట్లను మాత్రమే తాము తొలిజాబితాలో ప్రకటించామని చెప్పారు. ఆదివారం తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గం భేటీ అవుతుందని, మిగిలిన సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసి వెల్లడిస్తామని తెలిపారు.

అభ్యర్థులు :

భద్రాచలం (ఎస్టీ): సున్నంరాజయ్య; మధిర (ఎస్సీ): లింగాల కమల్‌రాజు; పాలేరు: తమ్మినేని వీరభద్రం; మిర్యాలగూడ: జూలకంటి రంగారెడ్డి; నల్గొండ: నంద్యాల నరసింహారెడ్డి; నకిరేకల్‌(ఎస్సీ): మామిడి సర్వయ్య; కురుపాం (ఎస్టీ): కోలక లక్ష్మణమూర్తి; విజయవాడ పశ్చిమ: సి.హెచ్‌.బాబూరావు; సంతనూతలపాడు (ఎస్సీ): జాలా అంజయ్య; కర్నూలు: ఎం.ఎ.గఫూర్‌.

Thursday, March 26, 2009

బియ్యం 40 కాంగ్రెస్ కి 40 : వి.శ్రీనివాసరావు

బియ్యం 40 కాంగ్రెస్ కి 40 (పార్ట్-2)

బియ్యం 40 కాంగ్రెస్ కి 40 (పార్ట్-3)

మహిళలను దెబ్బతీసిన మాంద్యం : బృందాకరత్

మహిళలను దెబ్బతీసిన మాంద్యం (పార్ట్-2)

యూపీఏ పాలనలో అరగంటకో అన్నదాత ఆత్మహత్య : యూపీఏ వైఫల్యాలను ఎండగడుతూ సీపీఎం కరపత్రం

న్యూఢిల్లీ : తమ హయాంలో వ్యవసాయరంగం బాగా వృద్ధి చెందిందని యూపీఏ సర్కారు తప్పుడు ప్రచారం చేస్తోందని సీపీఎం దుయ్యబట్టింది. సర్కారు లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని విమర్శించింది. యూపీఏప్రభుత్వ విధానాలు రైతుల పాలిట మృత్యుమార్గాలయ్యాయని, ఈ అయిదేళ్లలో ప్రతి అరగంటకొకరు చొప్పున 69,064 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీపీఎం ధ్వజమెత్తింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో మన్మోహన్‌ సర్కార్‌ ఘోరంగా విఫలమైనట్లు ఆరోపించింది. దేశంలో ఒక చెరుకు తప్ప మిగతా పంటలు సాగుచేస్తున్న ఏ రైతుకూ పెట్టినఖర్చులో కనీసం 50 శాతం కూడా తిరిగి రావడంలేదని ఎత్తిచూపింది. యూపీఏ నాలుగేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు వరదరాజన్‌, రామచంద్రన్‌ పిళ్త్లెలు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో 'అబద్ధాలు, మోసం, ప్రచారార్భాటం.. వ్యవసాయంపై యూపీఏ నివేదిక ' పేరిట ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు...

*ప్రభుత్వం పదిశాతం వృద్ధిరేటు సాధిస్తున్నట్లు చెప్పుకుంటున్నా వ్యవసాయవృద్ధి మాత్రం 2.4 శాతానికి మించలేదు. 2008 డిసెంబర్‌ నాటికిది మైనస్‌ 2.2 శాతానికి చేరింది.
*గత నాలుగేళ్ల యూపీఏ పాలనలో 69,064 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతి అరగంటకు ఒక రైతు బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు.
*దేశవ్యాప్తంగా రుణ ఊబిలో చిక్కుకున్న రైతు కుటుంబాలు 8.9 కోట్లున్నాయి. రుణమాఫీ పథకం వల్ల 3.6 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందినట్లు కాంగ్రెస్‌ చెబుతోంది. అంటే మొత్తం రుణగ్రహీతల్లో 50 శాతం మందిక్కూడా లాభం చేకూరలేదు.
*వ్యవసాయ రుణాలను 4 శాతం వడ్డీకే ఇవ్వాలని స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదు. జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద పంటల బీమాను అన్నింటికీ వర్తింపజేయాలన్న సూచననూ పరిగణలోకి తీసుకోలేదు.
*వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు పెంచినట్లు చెబుతున్నా.. బడ్జెట్‌లో మాత్రం పెరుగుదల కనిపించడంలేదు. పదకొండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగానికి అదనపు బడ్జెట్‌ మద్దతు కింద రూ.25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. అంటే దేశంలోని 600 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు అదనంగా కేటాయించిన మొత్తం కేవలం రూ.10 కోట్లే.
*దేశంలోని ఏ రైతుకూ గిట్టుబాటు ధరలు రావడంలేదు. సాగు ఖర్చుకు తగ్గట్టు ఏ పంటకూ కనీస మద్దతు ధర నిర్ణయించలేదు. పంటవేసిన ప్రతిసారీ రైతుకు 38 శాతం నుంచి 50 శాతం దాకా నష్టం మిగులుతోంది.
*వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఆర్థిక సర్వే ప్రకారం గత దశాబ్దంలో ఏడాదికి 57 రోజులకు మించి వ్యవసాయ కార్మికులకు పని లభించలేదు. జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 80.6 కోట్ల మంది తలసరి వ్యయం రోజుకు కేవలం 20 రూపాయలు మాత్రమే.

Wednesday, March 25, 2009

కాంగ్రెస్‌ది మేకపోతు గాంభీర్యం:నోముల నర్సింహయ్య

జనగామ : రాష్ట్రంలో ఆరిపోయే దీపంలా మారిన కాం గ్రెస్‌పార్టీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నదని సీపీఎం శాసనసభా పక్షనాయకుడు నోముల నర్సింహయ్య అన్నారు. బుధవారం వరంగల్‌ జిల్లా జనగామలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం మహాగొప్పదంటు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు పార్టీ మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.

ఆరోగ్యశ్రీ పథకంలో లోపాలున్నాయని, తాముచెబితే పట్టించుకోకుండా అప్పణంగా కోట్లాదిరూపాయలు ముట్టచెప్పారని విమర్శించారు. తెలంగాణలో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎండిపోతున్నా పట్టించుకోని ప్ర భుత్వం కృష్ణాజలాలను మాత్రం పోతిరెడ్డిపాడుకు తరలించుకపోయిందన్నారు.

తెలంగాణ ప్రాంత ప్రజలకు ప్రాణప్రదమైన గోదావరి జలాలు అందాలంటే 360రోజులు నీటినిల్వ ఉండాలని, అందుకుగాను కంతనపల్లివద్ద రిజర్వాయర్‌ నిర్మించాలన్నారు. వరంగల్‌ జిల్లాలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. దళితులు, మైనార్టీలకు అన్యాయం చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌పార్టీని ఓ డించేందుకు అన్నివర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

మహాకూటమిదే విజయం: ఎంపీ మధు

కర్నూలు : పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూట మి విజయం సాధిస్తుందని సీపీఎం ఎంపీ మధు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలే తమ కూటమిని గెలిపిస్తాయన్నారు. బుధవారం కర్నూలులోని సీపీఎంకార్యాలయంలో ఆయన విలేఖరులతో సమావేశంలో మా ట్లాడారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో వ్యాట్‌ ను అధికంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

మహాకూటమిలో ప్రతిష్ఠంభన తొలగిపోయిందన్నారు. కాంగ్రెస్‌ నాయకులు తమ పార్టీలో రెబెల్స్‌ సమస్య ను పరిష్కరించుకోవాల్సిందిపోయి మహాకూటమిలో చిచ్చుపెట్టే కుతంత్రాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకివస్తే కిలో బి య్యం రేటు 60రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నారు. రానురాను ప్రజారాజ్యం పార్టీ బలహీనపడుతున్నదని చెప్పారు.

మతతత్వ బీజేపీకి, అవినీ తి కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కేంద్రంలో మూడవ ప్రత్యామ్నా య పార్టీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కర్నూలుకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు తీసుకువస్తానని చెప్పారు. పేద ప్రజలకు అవసరమైన ఇళ్లు, స్థలాలు ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని చెప్పారు. మహాకూటమి అధికారంలోకివస్తే అసంఘటిత కార్మికులను పర్మినెంట్‌ చేయటానికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే ఎం.ఏ.గఫూర్‌ పాల్గొన్నారు.

20 స్థానాల్లో సీపీఎం పోటీ : జాబితా ప్రకటించిన రాఘవులు

హైదరాబాద్‌: తెదేపా- సీపీఎంల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పూర్తవలేదని సీపీఎం తేల్చిచెప్పింది. తాము 16 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని పార్టీ కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు రాఘవులు బుధవారమిక్కడ చెప్పారు. ఈ సందర్భంగా తాము పోటీ చేయదలచిన స్థానాలను కూడా ఆయన ప్రకటించారు. వైరా, భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్‌, వరంగల్‌ తూర్పు, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ఉప్పల్‌, కురుపాం, గాజువాక, ఆచంట, విజయవాడ సెంట్రల్‌, మంగళగిరి, సంతనూతలపాడు, నెల్లూరు రూరల్‌, అనంతపురం, కర్నూలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. తెదేపాతో చర్చలు జరుగుతుండగా.. 16 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకున్నట్లు వార్తలొస్తుండటంతో తమ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. ఈ గందరగోళానికి తెరదించేందుకే జాబితాను విడుదల చేశామని తెలిపారు. 'సీట్ల సర్దుబాటుపై తెదేపాతో కొనసాగుతున్న చర్చలు ఫలప్రదమై ఒప్పందం కుదిరితే.. అప్పుడు పరిస్థితిని బట్టి మా జాబితాలో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు' అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలన్నిటినీ రాఘవులు తమ పార్టీ జాతీయ నేతలు ప్రకాశ్‌కారత్‌, సీతారాం ఏచూరిల దృష్టికి తీసుకువెళ్లారు.