సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Wednesday, March 25, 2009

20 స్థానాల్లో సీపీఎం పోటీ : జాబితా ప్రకటించిన రాఘవులు

హైదరాబాద్‌: తెదేపా- సీపీఎంల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం పూర్తవలేదని సీపీఎం తేల్చిచెప్పింది. తాము 16 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్లు వస్తున్న వార్తలు ఊహాగానాలేనని పార్టీ కార్యదర్శి బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు రాఘవులు బుధవారమిక్కడ చెప్పారు. ఈ సందర్భంగా తాము పోటీ చేయదలచిన స్థానాలను కూడా ఆయన ప్రకటించారు. వైరా, భద్రాచలం, మధిర, పాలేరు, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్‌, వరంగల్‌ తూర్పు, ఇబ్రహీంపట్నం, పటాన్‌చెరు, ఉప్పల్‌, కురుపాం, గాజువాక, ఆచంట, విజయవాడ సెంట్రల్‌, మంగళగిరి, సంతనూతలపాడు, నెల్లూరు రూరల్‌, అనంతపురం, కర్నూలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. తెదేపాతో చర్చలు జరుగుతుండగా.. 16 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకున్నట్లు వార్తలొస్తుండటంతో తమ పార్టీలో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. ఈ గందరగోళానికి తెరదించేందుకే జాబితాను విడుదల చేశామని తెలిపారు. 'సీట్ల సర్దుబాటుపై తెదేపాతో కొనసాగుతున్న చర్చలు ఫలప్రదమై ఒప్పందం కుదిరితే.. అప్పుడు పరిస్థితిని బట్టి మా జాబితాలో కొన్ని మార్పులు చోటుచేసుకోవచ్చు' అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలన్నిటినీ రాఘవులు తమ పార్టీ జాతీయ నేతలు ప్రకాశ్‌కారత్‌, సీతారాం ఏచూరిల దృష్టికి తీసుకువెళ్లారు.

No comments:

Post a Comment