కర్నూలు : పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూట మి విజయం సాధిస్తుందని సీపీఎం ఎంపీ మధు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలే తమ కూటమిని గెలిపిస్తాయన్నారు. బుధవారం కర్నూలులోని సీపీఎంకార్యాలయంలో ఆయన విలేఖరులతో సమావేశంలో మా ట్లాడారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా రాష్ట్రాలకంటే మన రాష్ట్రంలో వ్యాట్ ను అధికంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మహాకూటమిలో ప్రతిష్ఠంభన తొలగిపోయిందన్నారు. కాంగ్రెస్ నాయకులు తమ పార్టీలో రెబెల్స్ సమస్య ను పరిష్కరించుకోవాల్సిందిపోయి మహాకూటమిలో చిచ్చుపెట్టే కుతంత్రాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకివస్తే కిలో బి య్యం రేటు 60రూపాయలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్నారు. రానురాను ప్రజారాజ్యం పార్టీ బలహీనపడుతున్నదని చెప్పారు.
మతతత్వ బీజేపీకి, అవినీ తి కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. కేంద్రంలో మూడవ ప్రత్యామ్నా య పార్టీని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కర్నూలుకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు తీసుకువస్తానని చెప్పారు. పేద ప్రజలకు అవసరమైన ఇళ్లు, స్థలాలు ఇస్తామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని చెప్పారు. మహాకూటమి అధికారంలోకివస్తే అసంఘటిత కార్మికులను పర్మినెంట్ చేయటానికి కృషి చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యే ఎం.ఏ.గఫూర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment