సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Thursday, March 26, 2009

యూపీఏ పాలనలో అరగంటకో అన్నదాత ఆత్మహత్య : యూపీఏ వైఫల్యాలను ఎండగడుతూ సీపీఎం కరపత్రం

న్యూఢిల్లీ : తమ హయాంలో వ్యవసాయరంగం బాగా వృద్ధి చెందిందని యూపీఏ సర్కారు తప్పుడు ప్రచారం చేస్తోందని సీపీఎం దుయ్యబట్టింది. సర్కారు లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని విమర్శించింది. యూపీఏప్రభుత్వ విధానాలు రైతుల పాలిట మృత్యుమార్గాలయ్యాయని, ఈ అయిదేళ్లలో ప్రతి అరగంటకొకరు చొప్పున 69,064 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని సీపీఎం ధ్వజమెత్తింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో మన్మోహన్‌ సర్కార్‌ ఘోరంగా విఫలమైనట్లు ఆరోపించింది. దేశంలో ఒక చెరుకు తప్ప మిగతా పంటలు సాగుచేస్తున్న ఏ రైతుకూ పెట్టినఖర్చులో కనీసం 50 శాతం కూడా తిరిగి రావడంలేదని ఎత్తిచూపింది. యూపీఏ నాలుగేళ్ల వైఫల్యాలను ఎండగడుతూ సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు వరదరాజన్‌, రామచంద్రన్‌ పిళ్త్లెలు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో 'అబద్ధాలు, మోసం, ప్రచారార్భాటం.. వ్యవసాయంపై యూపీఏ నివేదిక ' పేరిట ప్రచార కరపత్రాన్ని విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు...

*ప్రభుత్వం పదిశాతం వృద్ధిరేటు సాధిస్తున్నట్లు చెప్పుకుంటున్నా వ్యవసాయవృద్ధి మాత్రం 2.4 శాతానికి మించలేదు. 2008 డిసెంబర్‌ నాటికిది మైనస్‌ 2.2 శాతానికి చేరింది.
*గత నాలుగేళ్ల యూపీఏ పాలనలో 69,064 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ప్రతి అరగంటకు ఒక రైతు బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు.
*దేశవ్యాప్తంగా రుణ ఊబిలో చిక్కుకున్న రైతు కుటుంబాలు 8.9 కోట్లున్నాయి. రుణమాఫీ పథకం వల్ల 3.6 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందినట్లు కాంగ్రెస్‌ చెబుతోంది. అంటే మొత్తం రుణగ్రహీతల్లో 50 శాతం మందిక్కూడా లాభం చేకూరలేదు.
*వ్యవసాయ రుణాలను 4 శాతం వడ్డీకే ఇవ్వాలని స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను కేంద్రం పట్టించుకోలేదు. జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద పంటల బీమాను అన్నింటికీ వర్తింపజేయాలన్న సూచననూ పరిగణలోకి తీసుకోలేదు.
*వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు పెంచినట్లు చెబుతున్నా.. బడ్జెట్‌లో మాత్రం పెరుగుదల కనిపించడంలేదు. పదకొండో పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయరంగానికి అదనపు బడ్జెట్‌ మద్దతు కింద రూ.25 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. అంటే దేశంలోని 600 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు అదనంగా కేటాయించిన మొత్తం కేవలం రూ.10 కోట్లే.
*దేశంలోని ఏ రైతుకూ గిట్టుబాటు ధరలు రావడంలేదు. సాగు ఖర్చుకు తగ్గట్టు ఏ పంటకూ కనీస మద్దతు ధర నిర్ణయించలేదు. పంటవేసిన ప్రతిసారీ రైతుకు 38 శాతం నుంచి 50 శాతం దాకా నష్టం మిగులుతోంది.
*వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఆర్థిక సర్వే ప్రకారం గత దశాబ్దంలో ఏడాదికి 57 రోజులకు మించి వ్యవసాయ కార్మికులకు పని లభించలేదు. జాతీయ శాంపిల్‌ సర్వే సంస్థ లెక్కల ప్రకారం దేశంలో 80.6 కోట్ల మంది తలసరి వ్యయం రోజుకు కేవలం 20 రూపాయలు మాత్రమే.

No comments:

Post a Comment