- సోమవారం ఉదయం నుంచే ప్రయాణం
- అరుణపతాకాలతో ఎర్రబారిన రైళ్లు
- విజయవాడకు చేరుకున్న వేలాది ప్రజా రథాలు

'పదరో పదన్నా... బెజవాడ సభకు పోయొద్దాం పదరన్నా' అంటూ రాష్ట్రవ్యాపితంగా ఊరూవాడా కదలుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా... ఆదిలాబాద్ నుంచి అమలాపుం దాకా ఎర్రజెండా అభిమానులు, కార్మికులు విజయవాడకు పయనమవుతున్నారు. మారుమూల గ్రామాలనుంచీ, దూర ప్రాంతాలనుంచీ సోమవారం ఉదయం నుంచే రైళ్లలోనూ, బస్సుల్లోనూ బయలుదేరారు.
విజయవాడ పరిసర ప్రాంతాలయిన తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచే భారీ సంఖ్యలో సభకు ప్రజలు బయలుదేరనున్నారు. ''మాకు గూడు చూపించిన
ఎర్రజెండా పార్టీ సభకు వేకువజామునే రైలెక్కి పోతున్నా'' అంటూ ఏలూరులో