సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...
సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి. ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు విప్లవాభివందనాలు...
Saturday, August 7, 2010
మీడియా సెంటర్ ప్రారంభం
నేటి నుంచి ప్రారంభం కానున్న సిపిఎం విస్తృత సమావేశాలను పురస్కరించుకొని విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను పార్టీ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విస్తృత సమావేశాలకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులతోపాటు పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర ముఖ్యమంత్రులు హాజరుకానున్నారని చెప్పారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సమావేశాలు ప్రారంభమవుతాయని, అనంతరం ప్రతినిధుల సభ జరుగుతుందని అన్నారు. ఈ నెల 10న భారీ ప్రదర్శనతోపాటు స్వరాజ్య మైదానం (పిడబ్ల్యుడి గ్రౌండ్స్)లో బహిరంగ సభ ఉంటుందనీ, సభకు లక్ష మందికిపైగా వస్తారనీ చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య కూడా పాల్గొన్నారు. ఈ సెంటర్‌కు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్.వెంకట్రావు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మీడియా సెంటర్ పనిచేస్తుందనీ, మీడియా సెంటర్‌లో కంప్యూటర్, ఫ్యాక్స్, ప్రింటర్, స్కానర్ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశామనీ వెంకట్రావు తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ నెల ఎనిమిదో తేదీ వరకూ సాయంత్రం ఆరు నుంచి పది గంటలవరకూ జింఖానా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment