గతం కంటే భిన్నంగా ఈ కాలంలో రామ సేన పేరుతో మతోన్మాద కార్యక్రమాలు, బాంబు పేలుళ్లు జరిగాయి. దాంతో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితితో పాటు మతసామరస్యం ఘోరంగా క్షీణించింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో మత సామరస్యాన్ని పరిరక్షించటం, మైనారిటీల హక్కులకు రక్షణ కల్పించటం వంటి చర్యలు ప్రజాతంత్ర ఉద్యమం ముందు పెద్ద సవాలుగా నిలిచింది. ఈ నేపథ్యంలో సిపిఎం కర్ణాటక రాష్ట్ర కమిటీ అనేక ప్రచారోద్యమాలు చేపట్టింది.
ఆరెస్సెస్ విషప్రచారానికి బాబా బుడాన్‌గిరి మఠం కేంద్రంగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో సూఫీ తెగకు చెందిన ముస్లింలకు ఇది పవిత్ర క్షేత్రంగా ఉంది. దీన్ని దక్షిణాదిన మరో అయోధ్యగా మారుస్తామని బిజెపి అఖిలభారత ఉపాధ్యక్షుడు అనంత్‌కుమార్ బహిరంగంగా ప్రకటించారు. కొంతకాలంగా బిజెపి, ఆరెస్సెస్ వేళ్లూనుకున్న దక్షిణాది జిల్లాల్లో ఈ సంస్థలకు అత్యంత ప్రీతిపాత్రమైన గోవధ నిషేధం సమస్య, మతాంతర వివాహాలకు వ్యతిరేకంగా దాడులు, మతం మార్పిడులకు వ్యతిరేకంగా పెద్దఎత్తున బిజెపి కార్యకలాపాలు నిర్వహించింది. దీంతో ఈ ప్రాంతంలో ప్రజలు మత భావనల ప్రాతిపదికన చీలిపోయారు.
ఈ పరిస్థితుల్లో కర్ణాటక రజతోత్సవం పేరిట వివిధ ప్రాంతాల, మతాల ప్రజానీకం మధ్య సామరస్య వాతావరణం నెలకొల్పటానికి పార్టీ నవంబరు 2008లో పలు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో ముఖ్యంగా రాష్ట్రంలో నాలుగు ప్రాంతాలు, బీదర్‌లో బసవ కళ్యాణ, చిక్‌మగళూరులోని బాబా బుడాన్‌గిరి, బాగల్‌కోట జిల్లాలోని కుదాల సంగమంల నుండి సిపిఎం నాలుగు ప్రచార జాతాలు చేపట్టింది. ఇందులో భాగంగా రెండు లక్షలకుపైగా ప్రచార కరపత్రాలు పంచిపెట్టారు. నాలుగు భారీ బహిరంగ సభలు, 124 సభలు నిర్వహించాము. రాష్ట్రంలోని 64 కేంద్రాల్లో ఏదో ఒక విధమైన కార్యక్రమం ఈ సందర్భంగా నిర్వహించబడింది. గోవధ నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ బిల్లు ద్వారా ముస్లింల సాంప్రదాయక ఆహారంలో భాగమైన గోమాంసాన్ని అందకుండా చేయటంతో పాటు చిన్న చిన్న కుటుంబాల ఆదాయానికి ఎసరు పెట్టటమే. రాష్ట్రంలో ఆరెస్సెస్ ఆధీనంలోని గోశాలలు తప్ప మరెవ్వరూ ఆవులు, ఎద్దులు అమ్మటానికి వీలు లేదని ఈ చట్టం నిర్దేశిస్తుంది. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో సహజ ఆదాయ వనరుగా ఉన్న పశువుల అమ్మకాలు కొనుగోళ్లు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో మైనారిటీలు, ఇతర గ్రామీణ ప్రజానీకం ఆదాయవనరులను దెబ్బతీసే ప్రయత్నాలు విరమించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించబడ్డాయి. అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై ఈ కాలంలో రాష్ట్రంలో జరిగిన ముఖ్య పోరాటాల్లో అసంఘ టితరంగ కార్మికుల
సమస్య లపై జరిగిన పోరాటం ఒకటి. నాలుగు దశల్లో జరిగిన ఈ పోరాటంలో కనీస నెలసరి వేతనం 6000గా ఉండాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ కింద కిలో రెండు రూపాయల చొప్పున 35 కుటుంబానికి 35 కిలోలు విడుదల చేయా లన్న డిమాండ్లు ముందుకు తెచ్చిం ది. 2009 సెప్టెం బరు వరకూ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనకు స్పందిచటానికి నిరాకరించింది. కార్మికులు చేపట్టిన పికెటింగ్‌తో రాష్ట్రం లోని కలెక్టరేట్లు స్థంభించి పోయాయి. క్రమంగా అసంఘ టిత కార్మికులతో పాటు పారిశ్రా మిక రంగ కార్మికులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు అవు తూ వచ్చారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం తీవ్రమైన దమనకాండకు పాల్పడింది. దీనికి వ్యతిరేకంగా హస్సన్ లాంటి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో 300 మంది మహిళలు దమన కాండకు నిరసగా పోలీసు స్టేషన్ల వద్దనే అన్నపానాదులు నిర్వహిస్తూ ధర్నాలు నిర్వహించారు.
ఆహారభద్రత హక్కు దిశగా
బిజెపి ఎన్నికల ప్రచారంలో పేదలకు కుటుంబానికి కిలో రెండు రూపాయల చొప్పున 35 కిలోల బియ్యం ఇస్తామని, బిపిఎల్‌కు ప్రాతిపదికగా ఉన్న కుటుంబ ఆదాయం 30వేలకు పెంచుతామని వాగ్దానం చేసింది. బిజెపి ప్రభుత్వం అధికారానికి వచ్చి సంవత్సర కాలం గడుస్తున్నా ఈ విషయమై ప్రస్తావనే లేకపోవటంతో వాగ్దానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బెంగుళూరులో 50వేల మందితో భారీ బహిరంగ సభను సిపిఎం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రభుత్వమే ఒక మంత్రిని బహిరంగ సభా స్థలికి వచ్చి విజ్ఞాపన పత్రం తీసుకొమ్మంది. డిమాండ్ సాధన దిశగా తదుపరి దశ ఉద్యమం జాతీయ స్థాయిలో పార్టీ చేపట్టిన ఆహారభద్రత హక్కు చట్టం సాధన ఉద్యమంతో మమేకం అయ్యేలా రూపొందిస్తున్నారు.
No comments:
Post a Comment