- విజయవాడలో విస్తృత ఏర్పాట్లు
- మధ్యాహ్నం 2 గంటలకు ప్రదర్శన
- 3 గంటలకు సభ
వెయ్యిమందితో కళారూపాలు
బహిరంగ సభ, ప్రదర్శన సందర్భంగా సుమారు వెయ్యిమంది కళాకారులు వివిధ కళా ప్రదర్శనలివ్వనున్నారు. ఈ ప్రదర్శనల్లో 500 మంది డప్పు కళాకారులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. వీరితోపాటు సుమారు 30 కోలాట బృందాలు వివిధ ప్రాంతాల నుండి రానున్నాయి. వీటితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపైనా అనేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా రైతు ఆత్మహత్యలు, అధిక ధరలు, మహిళలపై దాడులు, అణు ఒప్పంద ప్రమాదం, విద్యార్థుల ఇక్కట్లు తదితర సమస్యలను కళారూపాల ద్వారా ప్రదర్శించనున్నారు. వీటితోపాటు గిరిజనహక్కులు, అటవీ హక్కుల చట్టం, భూ పోరాటం వంటి ప్రదర్శనలూ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటపై ప్రదర్శించనున్న కళారూపం ఆకట్టుకోనుంది. భద్రాచలం నుండి కొమ్ము గురవయ్యలు, శ్రీకాకుళం నుండి తప్పెటగుళ్లు కళాకారులు రానున్నారు. అలాగే శ్మశానస్థలాలు ఆక్రమించొద్దని కోరుతూ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. 30 మందితో కూడిన కళాకారుల బృందం వేదికపై ఒంటిగంట నుంచే అరుణ గీతాలు ఆలపించనుంది.
ప్రదర్శనకు వచ్చేవారికి సూచనలు
1.హైదారబాద్ రూటులో వచ్చే (ఇబ్రహీంపట్నం మీదుగా ర్యాలీకి వచ్చే) కుమ్మరిపాలెం సెంటర్‌లో ప్రదర్శనకారులు వాహనాలు దిగి మున్సిపల్ కార్పొరేషన్ వద్దకు చేరుకోవాలి. ఈ రూటులో వచ్చే లారీలు బిఆర్‌టిఎస్ రోడ్డులో పార్కింగు చేసుకోవాలి.
2. కనకదుర్గ వారథి మీదుగా వచ్చే వాహనాలన్నీ స్క్రూబ్రిడ్జి వద్ద దిగి బెంజిసర్కిల్ నుంచి ప్రారంభమయ్యే ప్రదర్శనలో పాల్గొనాలి. ఈ రూటులో వచ్చిన వాహనాలన్నీ పక్కనే గల రామలింగేశ్వర నగర్ ఫీడరు రోడ్డులో (గీతానగర్)వాహనాలు నిలుపుకోవాలి.
3.తూర్పు కృష్ణా బందరు రోడ్డులో వచ్చే వాహనాలు ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రదర్శనకారులు దిగి బెంజిసర్కిల్ నుంచి ప్రారంభమయ్యే ప్రదర్శనలో పాల్గొనాలి. ఈ రూటులో వచ్చిన వాహనాలు పక్కనేగల కృష్ణవేణి కళాశాల పంట కాలువ రోడ్డులో పార్కింగు చేసుకోవాలి.
4. ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలను రామవరప్పాడు రింగు రోడ్డు నుంచి వినాయక థియేటర్ మీదుగా గాయత్రీ నగర్ మైనేని టీ స్టాల్ వద్ద నిలుపుకుని, ప్రదర్శనకారులు బెంజి సర్కిల్ నుంచి ప్రారంభమయ్యే ప్రదర్శనలో పాల్గొనాలి. ఈ రూటులో వచ్చే వాహనాలన్నీ లయోలా కళాశాల రోడ్డులో పార్కింగు చేయాలి.
5. నూజివీడు వైపు నుంచి వచ్చే వాహనాలన్నీ బిఆర్‌టిఎస్ రోడ్డులో నిలుపుకొని అక్కణ్నుంచి ప్రదర్శనకారులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకొని ప్రదర్శనలో పాల్గొనాలి.
ఎంత ఎర్రపార్టీ అయితే మాత్రం ఈ ఎర్ర తీం ఏంటి ? చదివే వాళ్ళ కల్లు దెబ్బతింటాయ్
ReplyDelete