- ఎగ్జిబిషన్ ప్రారంభించిన రాఘవులు
ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ భవిష్యత్తులో సరళీకరణ విధానాలు, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాడే
శక్తులకు ఈ ఎగ్జిబిషన్ మరింత స్ఫూర్తి నింపుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పేదలు మరింత నిరుపేదలవుతున్నారన్నారు. శనివారం నుండి మూడు రోజులపాటు జరిగే విస్తృత సమావేశాల్లో వీటిపై చర్చిస్తామని తెలిపారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వంటి విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం, దాని అనుచరులు ప్రజలను దోచుకుంటున్నారని తెలిపారు. గతంలో వామపక్షాలు మద్దతిచ్చినంతకాలం యుపిఎ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అడ్డుకున్నాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. దీనికి వ్యతిరేకంగా అన్ని పక్షాలను కలుపుకొని ఐక్యపోరాటాలు నిర్వహించాల్సి ఉందని తెలిపారు. అటువంటి పోరాటాలకు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన అనేక ఘట్టాలు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ ఇన్‌ఛార్జి సత్యరంజన్, వెలగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 500 ఎగ్జిబిట్లను ఇందులో ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment