పాలకులు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు దేశంలోని మహిళలపై పెనుభారాలు మోపుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నేటికీ లింగ వివక్ష కొనసాగటం శోచనీయమన్నారు. సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలను పురస్కరించుకుని విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జర్మన్ కమ్యూనిస్టు నేత, జర్నలిస్టు ఔగుస్టు బేబెల్ రచించిన 'మహిళలు-సోషలిజం' అనే పుస్తకాన్ని బృందాకరత్ ఆదివారం ఆవిష్కరించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన
ఈ కార్యక్రమంలో ఐద్వా జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుభాషిణి అలీ, సుధా సుందరరామన్, సహాయ కార్యదర్శి జోసిఫిన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.పుణ్యవతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బృందాకరత్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వివక్షకు గురవుతున్న మహిళల సాధకబాధకాలను వివరిస్తూ బేబెల్ వందేళ్లకు పూర్వమే ఈ పుస్తకాన్ని రచించారని గుర్తుచేశారు. ఈ పుస్తకాన్ని తాను ఆవిష్కరించటం సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు.
కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన నిర్మాణ కార్యకలాపాల్లో ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న శ్రామిక మహిళలకు ప్రభుత్వం కనీస వసతులు కల్పించలేదని విమర్శించారు.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వాలు, న్యాయస్థానాలు సైతం విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలోని పెట్టుబడిదారులు శ్రామిక ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తున్న 'మహిళలు-సోషలిజం' పుస్తకం ప్రస్తుత పరిస్థితికి దర్పణంపట్టే విధంగా ఉందని అన్నారు. సుభాషిణిఅలీ మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అసమానతలను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ విషయాలన్నింటినీ రచయిత వందేళ్ల క్రితమే తన పుస్తకంలో విపులంగా వివరించారని కొనియాడారు.
సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...
సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి. ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు విప్లవాభివందనాలు...
No comments:
Post a Comment