సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Saturday, August 7, 2010

అరుణారుణం.. అజరామరం..

 
అరుణారుణం.. అజరామరం..

అరుణారుణమై వెలుగొందుతోంది
అజరామరమై కొనసాగుతోంది
మార్క్స్‌ ఎంగెల్స్‌ల సిద్ధాంత రూపుతో
లెనిన్‌ స్టాలిన్‌ ఆచరణ దీపమైంది

శ్రామికుల రక్తంలో తడిసి
ఎరుపు వర్ణం అద్దుకుంది
పీడిత, శ్రామికులకు గుర్తుగా
కత్తీసుత్తిని చిహ్నంగా చేర్చుకుంది

విప్లవాలు ఉద్యమాలే ఊపిరిగా
విశ్వమంతా విస్తృతమవుతోంది
శ్రామికవర్గ నాయకత్వంలో
సమసమాజ స్థాపనే లక్ష్యమంది

సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన
మార్క్సిజం-లెనినిజమే సిద్ధాంతమంది
సోషలిస్టు చైతన్యం నింపుతూ
సమరశీలురుగా తీర్చి దిద్దింది

సామ్యవాద దృక్పథంతో
సామ్రాజ్యవాదాన్ని దునుమాడుతోంది
మతోన్మాదాన్ని అడ్డుకుంటూ
లౌకికతత్వాన్ని నెలకొల్పుతోంది

ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరేసేటందుకు
ఆంధ్రప్రదేశ్‌లోనే సిద్ధాంతం రాసుకుంది
తెలంగాణా పోరాట పటిమతో
సాయుధపోరాటానికి నాంది పలికింది

ముచ్చటగా మూడు రాష్ట్రాల్లో
కొలువుదీరి కూర్చుంది
ప్రత్యామ్నాయ మార్గంతో
ప్రజాప్రయోజనాలు నెరవేరుస్తోంది

ఆటుపోట్లకు అదరకుండా
వేర్పాటు ఉద్యమాలకు ఎదురొడ్డింది
అతివాద పోకడలకు వెరవకుండా
పోరాట పటిమను పెంచుతోంది

ఉద్యమాల పుట్టినింట అగ్రనేతలతో
సిపిఐ(ఎం) సమావేశమవుతుంది
దేశ రాజకీయాలు సమీక్షించి
విజయవాడ వేదికగా వ్యూహరచన చేస్తోంది
- శాంతిశ్రీ

No comments:

Post a Comment