సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Saturday, August 7, 2010

ఐక్య ఉద్యమాల ద్వారానే రాజకీయ ప్రత్యామ్నాయం


  • లేకుంటే ప్రజా సమస్యల పరిష్కారం అసాధ్యం
  • తక్షణం కలిసొచ్చే పక్షాలతో ఉద్యమాలు
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు
దేశంలో లౌకిక, ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్మించడం ద్వారా మాత్రమే రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయగలమనీ, దీనికోసం తమ పార్టీ కృషి చేస్తోందనీ సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. సిపిఎం విస్తృత సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం విజయవాడ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.
దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయ కూటమి తక్షణం అవసరమే.. అయితే ఈ ప్రత్యామ్నాయానికి అవసరమైన రాజకీయ పార్టీలు, శక్తులు పరిమితంగా ఉన్నాయని తెలిపారు. కొన్ని శక్తులు సమస్యలపై జరిపే ఉద్యమాల్లో కలిసి వస్తున్నప్పటికీ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు విషయంలో ఊగిసలాట ప్రదర్శిస్తున్నాయని వివరించారు. ప్రతిపక్షంలో ఉండగా సరళీకరణ ఆర్థిక విధానాలను వ్యతిరేకించిన పలు ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగానే వాటినే అమలు చేస్తున్నాయన్నారు. ఆర్థిక విధానాల విషయంలో ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్‌, బిజెపిలకు భిన్నంగా ఏమీ లేవన్నారు. రాజకీయ ప్రయోజనం ఉందనుకుంటే మతతత్వ బిజెపితో కూడా కలిసి పనిచేసేందుకు కొన్ని ప్రాంతీయ పార్టీలు రాజీ పడుతున్నాయన్నారు. ఈ తరుణంలో విధానపరమైన ప్రత్యామ్నాయానికి ఊగిసలాటలు ప్రదర్శించే ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉంటాయని భావించలేమని, అయితే అదే సందర్భంలో అనేక పార్టీలు ప్రజా సమస్యలపై కలిసొస్తున్నాయనీ తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బిజెపియేతర రాజకీయ ప్రత్యామ్నాయాన్ని సిపిఎం ప్రతిపాదిస్తోందన్నారు. ఈ క్రమంలో మిగిలిన పార్టీలను కలుపుకొని పోయేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు.


ప్రాంతీయ పార్టీల భాగస్వామ్యంతో మరిన్ని ఉద్యమాలు నిర్మించడం ద్వారా రాజకీయ ప్రత్యామ్నాయం రూపొందించొచ్చనే విషయాన్ని సిపిఎం బలంగా ప్రతిపాదిస్తోందన్నారు. ప్రస్తుత తరుణంలో దేశంలో బిజెపిగానీ, కాంగ్రెస్‌గానీ, ఇతర బూర్జువా-భూస్వామ్య, ప్రాంతీయ పార్టీలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఒకే విధంగా ఉన్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయం తక్షణమే ఏర్పాటు చేయడం సాధ్యం కాకపోవచ్చు కూడా... అటువంటి ప్రత్యామ్నాయం లేకుండా దేశ సమస్యలను పరిష్కరించడం సాధ్యం కాదన్నారు. ఈ దృష్ట్యానే ఎక్కువ సమయం పట్టినా ప్రత్యామ్నాయ శక్తులను కూడగట్టేందుకు సిపిఎం ప్రయత్నిస్తోందన్నారు. అటువంటి కూటమి ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందని తెలిపారు. తక్షణ సమస్యల వరకూ ఎన్ని ఊగిసలాటలున్నా కలుపుకొని పోవచ్చనే అవగాహనతో సిపిఎం పని చేస్తోందన్నారు. మత తత్వానికి వ్యతిరేకంగా, ధరల పెరుగుదలకు, అణుఇంధన ఒప్పందానికి వ్యతిరేకంగా కలిసొచ్చే పార్టీలతో వామపక్షాలు ఇప్పటికే కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. విధానపరమైన ప్రత్యామ్నాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే తక్షణ సమస్యలపై ఇతర పార్టీలను కలుపుకొని పోవడానికి, ఎన్నికల్లో తాత్కాలికంగా సర్దుబాట్లు చేసుకోవడానికి సిపిఎం పూనుకుంటోందన్నారు.

No comments:

Post a Comment