సిపిఎం విస్తృత సమావేశాలకు సర్వం సిద్ధం
- ప్రారంభించనున్న ప్రకాశ్ కరత్
- విజయవాడకు చేరుకున్న ప్రతినిధులు
- సాదర స్వాగతం పలికిన నేతలు
- ఎగ్జిబిషన్, మీడియా సెంటర్ ప్రారంభం
నేటి నుండి జరిగే సిపిఎం విస్తృత సమావేశాలకు విజయవాడ సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 10.30 గంటలకు తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సమావేశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కరత్ ప్రారంభిస్తారు. సమావేశాల నిర్వహణకు ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అనంతరం ప్రతినిధుల సభ జరుగుతుంది. మంగళవారం వరకూ జరిగే ఈ సమావేశాల్లో 376 మంది ప్రతినిధులు పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం నగరంలో భారీ ప్రదర్శన, స్వరాజ్య మైదానంలో బహిరంగ సభ ఉంటుంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కరత్, పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య, కేరళ ముఖ్య మంత్రి విఎస్ అచ్యుతానందన్ శనివారం వస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్, పలువురు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, సీనియర్ నేతలు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానా శ్రయం లోనూ, విజయవాడ రైల్వేస్టేషన్‌లోనూ వీరికి ఘన స్వాగతం లభించింది.శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమానా శ్రయానికి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి బిమన్‌బసు, మంత్రి నిరు పమ్‌సేన,్ కేరళ మంత్రులు పియం కుట్టి, థామస్ ఐజాక్, యం.విజయకుమార్, గురుదాసన్, పికె శ్రీమతి, త్రిపుర మంత్రి అనిల్ సర్కార్ తదితరులు వచ్చారు.
No comments:
Post a Comment