- విస్తృత సమావేశాల జయప్రదానికి సుశిక్షితులైన 800 మంది వలంటీర్ల సేవలు
షహీద్‌నగర్ వద్ద బాధ్యతల్లో మహిళలు
షహీద్ నగర్‌లో ప్రతినిధులకు ఐద్వా, విద్యార్ధి, యువజన విభాగాలకు చెందిన వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. 43 మంది మహిళలు ఈ విభాగంలో ప్రతినిధులకు భోజన ఏర్పాట్లు చూస్తున్నారు. వీరితోపాటు వివిధ సంఘాల కార్యకర్తలు కూడా పనిచేస్తున్నారు.
ప్రతినిధుల బస ఏర్పాట్లలో
సమావేశాలకు హాజరైన ప్రతినిధులకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో వసతి కల్పించారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర ముఖ్యమంత్రులు, 27 మంది మంత్రులు, ఇంకా ఎంపిలు, ఎంఎల్‌ఏలకు వారి బసల వద్ద ఆంగ్ల, హిందీ, మళయాల, తమిళ భాషల్లో ప్రావీణ్యమున్న సుశిక్షితులైన 65 మంది వలంటీర్లు సేవలందిస్తున్నారు. వీరిలో ఐదుగురు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉన్నారు.
వైద్య సేవల విభాగం
ప్రతినిధుల కోసం షహీద్ నగర్‌లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బిపి, షుగర్ వంటి పరీక్షల నిర్వహణకు వైద్యులున్నారు. అన్ని రకాల మందులనూ అందుబాటులో ఉంచారు. శిబిరం ఉదయం ఎనిమిదికి మొదలై రాత్రి పదిన్నర వరకూ పనిచేస్తోంది. డాక్టర్ పి.విజరుకుమార్, డాక్టర్ భాస్కరరావు, డాక్టర్ మురళీ, డాక్టర్ శ్రీనివాస్ వైద్య సేవలందిస్తున్నారు.
రవాణా సేవల్లో...
ప్రతినిధులను సమావేశ హాలు నుంచి బసకూ, అక్కణ్ణుంచి మళ్లీ హాలుకూ తీసుకెళ్లి తీసుకువచ్చేందుకు 11 బస్సులు, 30 ఇతర వాహనాలను సమకూర్చారు. ఈ విభాగంలో 30 మంది వలంటీర్లు ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి11 గంటలవరకూ కృషి చేస్తున్నారు.
ప్రజాప్రదర్శన, బహిరంగ సభల ఏర్పాట్లలో..
మంగళవారం విజయవాడ పిడబ్య్లుడి గ్రౌండ్‌లో జరగనున్న బహిరంగ సభ, ప్రజాప్రదర్శనల ఏర్పాట్లను వలంటీర్లు పూర్తి చేశారు. 60 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పుగల స్టేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి సభకు రంగం సిద్థం చేశారు.ప్రతినిధులకు సేవలందిస్తున్న వారిలో ఎల్‌ఐసి, బ్యాంకింగ్, ఆర్టీసీ ఉద్యోగులు, మున్సిపల్, ముఠా కార్మికులు, షాప్ ఎంప్లాయీస్ ఉన్నారు. కార్మిక, వ్యవసాయ, రైతు, కెవిపిఎస్, వృత్తిదారులు, తదితర ప్రజా, వర్గ సంఘాలకు చెందిన కార్యకర్తలున్నారు.
No comments:
Post a Comment