- బెంజి సర్కిల్ నుండి బయలుదేరే ప్రదర్శన
2. స్రూబ్రిడ్జి వద్ద ప్రదర్శనకారులను దించిన వాహనాలు రామలింగేశ్వరనగర్ ఫీడర్ రోడ్డులో పార్కింగు చేయాలి.
3. కనకదుర్గ వారథి మీదుగా వచ్చే ప్రదర్శకులు బహిరంగసభ అనంతరం సభావేదిక వెనుక రోడ్డులో నుంచి కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా రామలింగేశ్వరనగర్ ఫీడర్ రోడ్డులో నిలిపి ఉన్న వాహనాలు ఎక్కి వెళ్లాలి.
4. బందరురోడ్డులో వచ్చే వాహనాలు ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద ఆపి బెంజి సర్కిల్‌ల్లో జరిగే ప్రదర్శనలో పాల్గొనాలి.
5. వాహనాలను కృష్ణవేణి కాలేజీ, పంట కాలువ రోడ్లలో పార్కింగు చేసుకోవాలి.
6. బందరురోడ్డులో వచ్చిన వారు బహిరంగ సభ అనంతరం బందరురోడ్డు నుండి పంటకాలువ వద్ద ఆపిన వాహనాల్లో ఎక్కి వెళ్లాలి.
7. ఏలూరు రోడ్డు నుండి వచ్చేవారు తమ వాహనాలను గాయత్రినగర్ మైనేనీ టీస్టాల్ వద్ద ఆపి బెంజి సర్కిల్‌కు చేరుకోవాలి.
8. వాహనాలను లయోలా కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డులో నిలుపుకోవాలి.
9. ఏలూరు రోడ్డు వైపు నుండి వచ్చిన ప్రదర్శకులు సభ అనంతరం బందరురోడ్డు నుండి లయోలా కళాశాల వద్దకు చేరుకోవాలి.
మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నుండి బయలుదేరే ప్రదర్శన
1. హైదరాబాద్ రూట్లో గొల్లపూడి మీదుగా వచ్చే వారు తమ వాహనాలను కుమ్మరిపాలెం సెంటర్ వద్ద ఆపి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాలి.
2. కుమ్మరిపాలెంలో ప్రదర్శకులను దించిన వాహనాలు విధ్యాధరపురం సెంటర్ మీదుగా టన్నెల్‌లో నుండి చిట్టినగర్ ఎర్రకట్ట మీదుగా బిఆర్‌టిఎస్ రోడ్డులో పార్కింగు చేయాలి.
3. హైదరాబాద్ రూట్లో వచ్చిన ప్రదర్శకులు సభ అనంతరం పోలీసు కమిషనర్ కార్యాలయం మీదుగా డోర్నకల్ రోడ్డు, కొత్తవంతెన దాటి, సాంబమూర్తి రోడ్డు క్రాస్ చేసి సంగీత కళాశాల వద్ద బిఆర్‌టిఎస్ రోడ్డులోకి చేరాలి.
4. నూజివీడు రోడ్డు నుండి వచ్చే వాహనాలను బిఆర్‌టిఎస్ రోడ్డులో పార్కింగు చేసి మున్సిపల్ కార్పొరేషన్ వద్ద నుండి బయలుదేరే ప్రదర్శనలో పాల్గొనాలి. వాహనాలను బిఆర్‌టిఎస్ రోడ్డులోనే పార్కింగు చేయాలి.
5. నూజివీడు రోడ్డులో వచ్చిన వారందరూ పోలీసు కమిషనర్ కార్యాలయం, డోర్నకల్ రోడ్డు, కొత్తవంతెన, సాంబమూర్తిరోడ్డు దాటి సంగీత కళాశాల వద్ద బిఆర్‌టిఎస్ రోడ్డులోకి చేరాలి.
No comments:
Post a Comment