- అక్రమ మైనింగ్‌పై సమగ్ర దర్యాప్తు
- ఏచూరి డిమాండ్
జాతీయ సంపదగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వాలను మైనింగ్ మాఫియా శాసిస్తోందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో అక్రమ తవ్వకాలపై సమగ్రంగా విచారణ జరిపించాలని అభిప్రాయపడ్డారు. మావోయిస్టుల వల్ల దేశ అంతర్గత భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని ప్రధాని మన్మోహన్ ఆందోళన వెలిబుచ్చారని, పశ్చిమబెంగాల్‌లోని పిసిపిఎను మావోయిస్టులు వెనుకుండి నడిపిస్తున్నారని కేంద్ర హోం మంత్రి చెప్పారని, ఇప్పుడు పిసిపిఎ నిర్వహిస్తున్న ర్యాలీలో కేంద్ర మంత్రి పాల్గొన్నారని విమర్శించారు. దీనికి కేంద్రం సమాధానం చెప్పాలని ఏచూరి డిమాండ్ చేశారు. మావోయిస్టుల హింసాత్మక కార్యకలాపాలను నిరోధించడానికి కేంద్రం పోలీస్ అపరేషన్ చేపట్టిందని, దీంతో మావోయిస్టులు చెల్లాచెదురయ్యారని అన్నారు. తృణమూల్ ర్యాలీ చెల్లా చెదురైన మావోయిస్టులు ఒక చోటకు చేరడానికి, బలోపేతం కావడానికి ఉపయోగ పడుతుందని వివరించారు. బెంగాల్ భౌగోళిక పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, దాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రమలకు భూములు సేకరించాల్సి ఉందని విలేకరుల ప్రశ్నకు ఏచూరి సమాధానం చెప్పారు. 'సింగూర్‌లో 900 ఎకరాలను సేకరించి 12 వేల మందికి పరిహారం చెల్లించాల్సి వచ్చింది. అంటే ఒక ఎకరంపై ఎడెనిమిది మంది ఆధారపడ్డారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. ఉపాధి అవకాశాలు పెంచాలి. అందుకు పెద్ద సంఖ్యలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నెలకొల్పాలి' అని తెలిపారు. ఈ ప్రాతిపదికపైనే బెంగాల్ ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని రూపొందించిందని, దానిపై కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. బెంగాల్‌లో వామపక్షాలకు 51 శాతం ఓట్లున్నాయని ఏచూరి అన్నారు. ప్రజాపునాదిలో పెద్దగా మార్పు లేదని వివరించారు. ఇటీవలి కాలంలో కొత్తగా 50 లక్షల కొత్త ఓటర్లు చేరారని, వారు వామపక్షాలకు ఓట్లు వేయలేదా, లేక పాత ఓటర్లు ఓట్లు వేయలేదా అన్న విషయంపై పరిశీలిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ మీడియాను వ్యతిరేకిస్తున్న సిపిఎం త్వరలో జాతీయ స్థాయిలో సొంత ఛానెల్ ప్రారంభిస్తుందా అన్న ప్రశ్నకు కేవలం ఛానల్ వల్లనే అన్నీ సాధిస్తామనుకోవడం లేదని, ప్రజల మద్దతు పొందడం ద్వారా విజయాలు సాధించడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.
'ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పార్టీలు స్వంతంగా పత్రికలు, ఛానళ్లు ప్రారంభించాయి. మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఈ పరిస్థితి ఉంది' అని అన్నారు. దిద్దుబాటు ఉద్యమంపై అడిగిన ప్రశ్నకు 'దిద్దుబాటు అంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కాదు. అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారనడం సరికాదు. దిద్దుబాటు అనేది నిరంతర ప్రక్రియ. ఈ సమావేశాల్లో దానిపై చర్చ జరగలేదు' అని చెప్పారు. ప్రత్యేక తెలంగాణా విషయంలో తమ వైఖరి ఎప్పుడో ప్రకటించామని, దానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వై వెంకటేశ్వరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ బాబూరావు, ఎస్ వెంకట్రావు పాల్గొన్నారు.
No comments:
Post a Comment