సిపిఐ(ఎం) అఖిల భారత విస్తృత సమావేశాలు

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 12వరకు విజయవాడలో...

సిపిఎం ఆఖిల భారత విస్తృత సమావేశాలు - ఆగస్ట్ 7నుండి 10వరకు విజయవాడలో...
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు విజయవాడలో ఉత్సాహపూరితంగా ఉత్తేజభరితంగా శనివారం ప్రారంభ మయ్యాయి.  ఈ సమావేశాలకు దేశం నలుమూలల నుండి విచ్చేసిన  కమ్యూనిస్ట్ నాయకులకు, సమావేశ సంరంభాలను వీక్షించేందుకు  రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి తరలివచ్చిన కమ్యూనిస్టు యోధులు, యువ కమ్యూనిస్టులు, మహిళా నేతలు, శ్రేయోభిలాషులకు  విప్లవాభివందనాలు...

Monday, August 9, 2010

నేడు బహిరంగ సభ

  • బెంజిసర్కిల్‌, కార్పొరేషన్‌ నుంచి భారీ ప్రదర్శనలు
  • ఏర్పాట్లు పూర్తి : వై వెంకటేశ్వరరావు
సిపిఎం విస్తృత సమావేశాల సందర్భంగా మంగళవారం విజయవాడ స్వరాజ్య మైదానం (పిడబ్యుడి గ్రౌండ్స్‌)లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం పిడబ్ల్యుడి గ్రౌండ్‌(స్వరాజ్యమైదానం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడో తేదీ నుండి విజయవాడలో జరుగుతున్న సిపిఎం విస్తృత సమావేశాలు మంగళవారం నాటికి ముగుస్తాయనీ, అనంతరం బహిరంగసభ ఉంటుందనీ వివరించారు. రెండు గంటలకు

ప్రదర్శనకు ఇలా చేరుకోవాలి

  • బెంజి సర్కిల్‌ నుండి బయలుదేరే ప్రదర్శన
1. కనకదుర్గ వారధి మీదుగా వచ్చేవారు తమ వాహనాలను రామలింగేశ్వరనగర్‌ స్క్రూబ్రిడ్జి వద్ద ఆపి బెంజి సర్కిల్‌ నుంచి ప్రారంభమయ్యే ప్రదర్శన ప్రాంతానికి చేరుకోవాలి.
2. స్రూబ్రిడ్జి వద్ద ప్రదర్శనకారులను దించిన వాహనాలు రామలింగేశ్వరనగర్‌ ఫీడర్‌ రోడ్డులో పార్కింగు చేయాలి.
3. కనకదుర్గ వారథి మీదుగా వచ్చే ప్రదర్శకులు బహిరంగసభ అనంతరం సభావేదిక వెనుక రోడ్డులో నుంచి కృష్ణలంక జాతీయ రహదారి మీదుగా రామలింగేశ్వరనగర్‌ ఫీడర్‌ రోడ్డులో నిలిపి ఉన్న వాహనాలు ఎక్కి వెళ్లాలి.
4. బందరురోడ్డులో వచ్చే వాహనాలు ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్ద ఆపి బెంజి సర్కిల్‌ల్లో జరిగే ప్రదర్శనలో పాల్గొనాలి.
5. వాహనాలను కృష్ణవేణి కాలేజీ, పంట కాలువ రోడ్లలో పార్కింగు చేసుకోవాలి.
6. బందరురోడ్డులో వచ్చిన వారు బహిరంగ సభ అనంతరం బందరురోడ్డు నుండి పంటకాలువ వద్ద ఆపిన వాహనాల్లో ఎక్కి వెళ్లాలి.
7. ఏలూరు రోడ్డు నుండి వచ్చేవారు తమ వాహనాలను గాయత్రినగర్‌ మైనేనీ టీస్టాల్‌ వద్ద ఆపి బెంజి సర్కిల్‌కు చేరుకోవాలి.
8. వాహనాలను లయోలా కళాశాల ఎదురుగా ఉన్న రోడ్డులో నిలుపుకోవాలి.
9. ఏలూరు రోడ్డు వైపు నుండి వచ్చిన ప్రదర్శకులు సభ అనంతరం బందరురోడ్డు నుండి లయోలా కళాశాల వద్దకు చేరుకోవాలి.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద నుండి బయలుదేరే ప్రదర్శన

1. హైదరాబాద్‌ రూట్లో గొల్లపూడి మీదుగా వచ్చే వారు తమ వాహనాలను కుమ్మరిపాలెం సెంటర్‌ వద్ద ఆపి మున్సిపల్‌ కార్యాలయానికి చేరుకోవాలి.
2. కుమ్మరిపాలెంలో ప్రదర్శకులను దించిన వాహనాలు విధ్యాధరపురం సెంటర్‌ మీదుగా టన్నెల్‌లో నుండి చిట్టినగర్‌ ఎర్రకట్ట మీదుగా బిఆర్‌టిఎస్‌ రోడ్డులో పార్కింగు చేయాలి.
3. హైదరాబాద్‌ రూట్లో వచ్చిన ప్రదర్శకులు సభ అనంతరం పోలీసు కమిషనర్‌ కార్యాలయం మీదుగా డోర్నకల్‌ రోడ్డు, కొత్తవంతెన దాటి, సాంబమూర్తి రోడ్డు క్రాస్‌ చేసి సంగీత కళాశాల వద్ద బిఆర్‌టిఎస్‌ రోడ్డులోకి చేరాలి.
4. నూజివీడు రోడ్డు నుండి వచ్చే వాహనాలను బిఆర్‌టిఎస్‌ రోడ్డులో పార్కింగు చేసి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద నుండి బయలుదేరే ప్రదర్శనలో పాల్గొనాలి. వాహనాలను బిఆర్‌టిఎస్‌ రోడ్డులోనే పార్కింగు చేయాలి.
5. నూజివీడు రోడ్డులో వచ్చిన వారందరూ పోలీసు కమిషనర్‌ కార్యాలయం, డోర్నకల్‌ రోడ్డు, కొత్తవంతెన, సాంబమూర్తిరోడ్డు దాటి సంగీత కళాశాల వద్ద బిఆర్‌టిఎస్‌ రోడ్డులోకి చేరాలి.

తరలి వస్తున్న జనవాహిని

  • సోమవారం ఉదయం నుంచే ప్రయాణం
  • అరుణపతాకాలతో ఎర్రబారిన రైళ్లు
  • విజయవాడకు చేరుకున్న వేలాది ప్రజా రథాలు
'పదరో పదన్నా... బెజవాడ సభకు పోయొద్దాం పదరన్నా' అంటూ రాష్ట్రవ్యాపితంగా ఊరూవాడా కదలుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా... ఆదిలాబాద్‌ నుంచి అమలాపుం దాకా ఎర్రజెండా అభిమానులు, కార్మికులు విజయవాడకు పయనమవుతున్నారు. మారుమూల గ్రామాలనుంచీ, దూర ప్రాంతాలనుంచీ సోమవారం ఉదయం నుంచే రైళ్లలోనూ, బస్సుల్లోనూ బయలుదేరారు.
విజయవాడ పరిసర ప్రాంతాలయిన తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచే భారీ సంఖ్యలో సభకు ప్రజలు బయలుదేరనున్నారు. ''మాకు గూడు చూపించిన
ఎర్రజెండా పార్టీ సభకు వేకువజామునే రైలెక్కి పోతున్నా'' అంటూ ఏలూరులో

ఖనిజ నిల్వలను జాతీయ సంపదగా ప్రకటించాలి

  • అక్రమ మైనింగ్‌పై సమగ్ర దర్యాప్తు
  • ఏచూరి డిమాండ్
దేశంలోని ఖనిజ నిల్వలను కేంద్రం జాతీయ సంపదగా ప్రకటించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. గనుల అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలని, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటకలో చట్ట వ్యతిరేక మైనింగ్‌పై విచారణ జరపాలని అన్నారు. సోమవారం మీడియా సెంటర్‌లో విలేకరులతో మాట్లాడుతూ

ముతక బట్టలు ధరించిన ఈయన మంత్రా?

సర్పంచ్‌గా గెలిస్తే చాలు రాయంచ నడక, నాయకత్వ నయగారం ఒలికించే రాజకీయ ప్రబుద్ధులను చూస్తున్న ప్రజలు, ఈ నిరాడంబర మంత్రులనూ, ఎంపీలనూ చూసి ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. ముతక బట్టలు ధరించిన ఈయన మంత్రా?, సాదాసీదాగా ఉన్న ఆయన ఎంపీనా? అంటూ చూపరులు చర్చించుకుంటున్నారు. ఓ ఎమ్మెల్యేగా ఎన్నికైతే చాలు 'రాజువెడలె రవితేజములలరగ' చందంగా పక్కన గన్‌మెన్లు, అనుచరుల హడావుడి, క్వాలీసు వాహనాల కాన్వాయిలతో హోరెత్తించే సంప్రదాయానికి భిన్నంగా నిరాడంబరంగా, నమ్రతగా, అందరినీ పలుకరిస్తూ కదిలివెళ్తున్న పశ్చిమ బెంగాల్‌, కేరళ, త్రిపుర రాష్ట్రాలకు చెందిన మార్క్సిస్టు మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలను చూసి విజయవాడ నగరవాసులు ఆశ్చర్యపోతున్నారు. ఈ మూడు రాష్ట్రాల నుంచి 27 మంత్రులు సిపిఎం జాతీయ విస్తృత సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. వీరు సమావేశ ప్రాంగణమైన తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం వద్దకు వచ్చి వెళ్లే సమయాల్లో తమకు కనిపించినప్పుడు ప్రజలు పై విధంగా చర్చించుకున్నారు.

విప్లవ స్ఫూర్తిని రగిలిస్తున్న అమరవీరుల చిహ్నం

 
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల సందర్భంగా షహీద్‌నగర్‌ (తుమ్మలపల్లి కళాక్షేత్రం)లో ఏర్పాటుచేసిన అమరవీరుల చిహ్నం రాబోయే తరాలకు విప్లవ స్ఫూర్తిని అందిస్తోంది. భూమి నుండి వచ్చిన చేయి ఎర్రజెండాను అందిస్తున్నట్లుగా ఉన్న ఈ చిహ్నం చూస్తుంటేనే పోరాట స్ఫూర్తి రగులుతోంది. కర్రతో ఏర్పాటు చేసిన ఈ చిహ్నం మోచేతివరకూ భూమిలో ఉంది. అక్కడ నుండి పైకొచ్చి జెండాను పట్టుకుంది. దీనిపై సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి శ్రీనివాసరావు మాట్లాడుతూ పోరాటవీరులు ప్రాణాలర్పించినా భావితరాలకు స్ఫూర్తిని అందిస్తున్నట్లు, భూమిలో కలిసిపోయినా సరే రానున్న తరాలను చైతన్యం చేయాలన్నట్లు ఈ చిహ్నం ఏర్పాటు చేశామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటువంటి చిహ్నం ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారన్నారు. ఈ చిహ్నం చుట్టూ ఏర్పాటు చేసిన పూలు వాడిపోకుండా ఏరోజుకారోజు మారుస్తున్నారు.

ఎందుకంత రహస్యం?

  • స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను చర్చకు పెట్టాలి : వరదరాజన్‌ డిమాండ్‌
సామ్రాజ్యవాద దేశాలతో భారత్‌ కుదుర్చుకుంటున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలవల్ల రైతుల బతుకులు చితికి పోతున్నాయని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) ప్రధాన కార్యదర్శి కె వరదరాజన్‌ అన్నారు. వాణిజ్య ఒప్పందాలు చేసుకొనే ముందు వాటిని పార్లమెంట్‌లో చర్చకు పెట్టాలని, రాష్ట్ర ప్రభుత్వాల నుండి

చైతన్య దీపికలు ప్రజా కళా సంబరాలు

  • జానపదమే జనజీవితంగా ' జజ్జనకరి జనారే'
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలను పురస్కరించుకొని ఏర్పాటైన ప్రజా కళాసంబరాలు రాష్ట్రంలోని పలుప్రాంతాల విశిష్టతనూ, వాటి సాంస్కృతిక వైభవ ప్రాభవాన్నీ, జనపదాల శ్రమైక జీవన కళా సౌందర్యాన్నీ వెలికి తీశాయి. విజయవాడ జింఖానా మైదానం (విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కళావేదికపై)లో ఈనెల ఐదు నుంచి ఎనిమిది వరకూ నాలుగు రోజులపాటు 'జజ్జకనరి జనారే' పేరిట ప్రజాకళా సంబరాలను ప్రజానాట్యమండలి (పిఎన్‌ఎం) నిర్వహించింది. నాలుగు రోజులపాటు ప్రదర్శించిన ఐదు నాటికలు వేటికవే ప్రత్యేకతను సంతరించుకొన్నాయి. భిన్న ఇతివృత్తాలతో వీక్షకుల మెదళ్లను పదునెక్కించాయి.'రసఝురి' పొన్నూరు వారు ప్రదర్శించిన 'సంపద' నాటిక ప్రపంచీకరణ వల్ల మాతృ, మానవ సంబంధాల మనుగడకే ప్రమాదం ఏర్పడిన నేపథ్యాన్ని వివరించింది. 'ఈ కథలు మార్చి చెప్పండి' నాటిక ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపచేసింది. ఆవుల్ని వేటాడే పులులు, జింకల్ని మింగేసే సింహాలు, బలహీనుల్ని దోచుకునే బలవంతులదే నడుస్తున్న చరిత్ర అనీ, బలహీనులే ఏకమై బలవంతుడ్ని ఎదుర్కోవాలన్నదే ఈనాటిక సారాంశం.

ఓహౌం బీం' నాటిక ప్రదర్శన కూడా పలువురి మెప్పు పొందింది. చిరకాలం జరిగిన మోసాలు, బలవంతుల దౌర్జన్యాలు, ధనవంతుల పన్నాగాలు 'ఇంకానా ఇకపై సాగవు' అని సందేశమిచ్చింది. సామ్రాజ్యవాదులు తమ వ్యాపారాలను విస్తృత పరుచుకోవడం ద్వారా లాభాలను దండుకునేందుకు మానవుణ్ణి వినిమయ బానిసగా మార్చేయడానికి ఇడియట్‌ బాక్స్‌ (టెలివిజన్‌)ను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నదీ 'విజన్‌ పాయిజన్‌' నాటిక సాక్షాత్కరింపచేసింది. తరతరాల తెలుగు భాషా ఔనత్యాన్నీ, విశిష్టతనూ తెలియజెప్పిందీ 'తెలుగు వెలుగు' నాటిక. నాటికలేగాక ఈ నాలుగు రోజులూ కళావేదికపై వైవిధ్యభరిత కళారూపాలు ప్రదర్శితమయ్యాయి.

మహిళలు-సోషలిజం పుస్తకం ఒక్క రోజులోనే 400 కాపీలు అమ్మకం

'మహిళలు సోషలిజం' పుస్తకానికి విశేషాదరణ లభిస్తోంది. సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఆదివారం విడుదల చేసిన 'మహిళలు - సోషలిజం' పుస్తకం ఒక్క రోజులోనే 400 కాపీలు ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ప్రత్యేక స్టాల్‌లో అమ్ముడయ్యాయి. ఇది అరుదైన పుస్తకమనీ, ఆలస్యంగానైనా అందుబాటులోకి తేవడం సంతోషకరంగా ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కరత్‌ అన్నారు.

ఎర్రజెండా నీడలోనే మహిళకు నిజమైన గౌరవం

  • బెంగాల్‌ మహిళా ఉద్యమ మణిపూస శ్యామలీ గుప్తా
కమ్యూనిస్టుల పాలనలోనే మహిళలకు సంపూర్ణ గౌరవం సాధ్యమౌతుందని సిపిఎం బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు శ్యామలీ గుప్తా వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్‌లో మూడున్నర దశాబ్ధాల వామపక్షాల పరిపాలనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. మహిళా సాధికారత, స్వేచ్ఛ, రాజకీయ భాగస్వామ్యం, సమాన వేతనాలు తదితర నినాదాలను బూర్జువా పార్టీలు ఉపన్యాసాలకే పరిమితం చేయగా...

అమూల్యం... స్ఫూర్తిదాయకం

  • ఫోటో ఎగ్జిబిషన్‌కు విశేష ఆదరణ
సిపిఎం కేంద్ర కమిటీ విస్తృత సమావేశాల నేపథ్యంలో ఇక్కడి షహీద్‌ నగర్‌ (తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం)లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌కు ప్రతినిధుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. సిపిఎం ఆవిర్భావానికి సంబంధించిన ఎంతో అమూల్యమైన ఫోటోలను ఎగ్గిబిషన్‌లో ఏర్పాటు చేశారు. మొత్తం 5 విభాగాలుగా ఫోటోలను పొందుపరిచారు. 1964లో తెనాలిలో జరిగిన పార్టీ ఆవిర్భావ సదస్సు, అదే ఏడాది కోల్‌కతాలో జరిగిన పార్టీ అఖిల భారత మహాసభ, 1982లో విజయవాడలో జరిగిన పార్టీ 11వ అఖిలభారత మహాసభ ఫోటోలతో పాటు పార్టీ వ్యవస్థాపక నేతలు సుందరయ్య, బసవపున్నయ్యకు చెందిన అమూల్యమైన చిత్రాలను ప్రదర్శనకు ఉంచారు. తెనాలి సదస్సు, విజయవాడ మహాసభ ఫోటోలు సీనియర్‌ నేతలకు ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నాయి. యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

కుల గోడలు బద్దలు కొట్టాం

  • దళితుల పట్ల 82 రకాల వివక్ష
  • ఉద్యమాల వల్ల అరుంధతీయులకు 3 శాతం రిజర్వేషన్లు
  • 'తమిళనాడు 'అంటరానితనం నిర్మూలన వేదిక'
  • ప్రధాన కార్యదర్శి సంపత్‌
దళితులను రానివ్వకుండా వివిధ దేవాలయాలకు అగ్రవర్ణాలవారు నిర్మించిన 'కుల గోడల్ని' ప్రజా సంఘాల సహకారంతో అంటరానితనం నిర్మూలన వేదిక బద్ధలు కొట్టిందనీ ఆ వేదిక తమిళనాడు ప్రధాన కార్యదర్శి సంపత్‌ తెలిపారు. తాము నిర్వహించిన ఆందోళనల వల్ల అరుంధతీయులకు (మన రాష్ట్రంలో మాదిగలతో సమానం) ఎస్సీ కోటాలో 3 శాతం రిజర్వేషన్లు (ఉప కోటా) లభించాయనీ వివరించారు. హోటళ్లలో రెండుగ్లాసుల పద్ధతి,

శ్రీశ్రీ అంటేనే ఉత్తేజం

  • సీతారాం ఏచూరి
  • మహాకవికి షహీద్‌నగర్‌లో శతజయంతి నివాళి
సిపిఎం విస్తృత సమావేశాలు జరుగుతున్న షహీద్‌నగర్‌ (తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం) ప్రాంగణంలో ఉన్న ప్రజాకవి శ్రీశ్రీ విగ్రహం వద్ద పార్టీ అగ్రనాయకులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మహాకవికి జేజేలు అర్పించారు. తన కలాన్నీ, కవిత్వాన్నీ కష్టజీవుల విముక్తికీ, కమ్యూనిస్టు ఉద్యమ వికాసానికీ అంకితమిచ్చిన శ్రీశ్రీ చిరస్మరణీయుడనీ వారు పేర్కొన్నారు. సోమవారం ఉదయం సిపిఎం సమావేశాలు జరుగుతున్న

'పెట్రో' పెంపు, అధిక ధరలపై ఉధృత పోరు

  • అస్థిత్వ రాజకీయాలతో ప్రజా సమస్యలు పక్కదారి
  • ప్రజాశక్తి ఇంటర్వ్యూలో ప్రకాశ్‌ కరత్‌
'పెట్రో ధరల పెంపు, అధిక ఆహార ద్రవ్యోల్బణంపై దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. జూలై 5న దేశవ్యాప్తంగా జరిగిన హర్తాళ్‌ గత రెండు దశాబ్దాల కాలంలో జరిగిన అతిపెద్ద ఆందోళన. ఈ స్ఫూర్తితో రాబోయే కాలంలో మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేస్తాం' అని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ చెప్పారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపిఎ-2 ప్రభుత్వం అనుసరిస్తోన్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న శ్రామికవర్గానికి నష్టదాయకంగా పరిణమించాయన్నారు. ఈ విధానాల వల్ల పేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలపై అధిక భారాలు పడుతున్నాయన్నారు. వీరందరినీ సమీకరించి శ్రామికవర్గ పోరాటాలకు

రేపే భారీ బహిరంగ సభ

  • విజయవాడలో విస్తృత ఏర్పాట్లు
  • మధ్యాహ్నం 2 గంటలకు ప్రదర్శన
  • 3 గంటలకు సభ
సిపిఎం జాతీయ విస్తృత సమావేశాల ముగింపు రోజైన మంగళవారం విజయవాడలో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచీ ప్రజలు తరలి రానుండటంతో

లాల్‌గఢ్‌ ర్యాలీపై ఏం చెబుతారు ?

  • కేంద్రాన్ని ప్రశ్నించిన కరత్‌
  • తృణమూల్‌ - మావోయిస్టుల మైత్రి బహిర్గతం
  • అణు ప్రమాదాలకు రియాక్టర్‌ కంపెనీలదే బాధ్యత
  • సవరణలు చేయకుంటే బిల్లును వ్యతిరేకిస్తాం
పశ్చిమ బెంగాల్‌లోని లాల్‌గఢ్‌లో సోమవారం తృణమూల్‌- మావోయిస్టులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ర్యాలీ ద్వారా వారిద్దరి మైత్రీ బహిర్గతమైందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ అన్నారు. తృణమూల్‌-మావోయిస్టుల సంబంధాలపై సాక్ష్యం కావాలని యుపిఎ ప్రభుత్వం అంటోందనీ, ఇంతకు మించిన సాక్ష్యం మరొకటి ఉండబోదని చెప్పారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తృణ మూల్‌కు మావోయిస్టులతో స్నేహంపై యుపిఎ సమా ధానం చెప్పాలనీ, తన వైఖరిని స్పష్టం చేయాలనీ డిమాండ్‌ చేశారు. బెంగాల్లో తృణమూలే తమ ప్రధాన ప్రత్యర్థని

విద్యాబిల్లుల ఆమోదం రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం

  • విజయవాడ సదస్సులో సీతారాం ఏచూరి
విద్యారంగంలో పెనుమార్పులు చేసేందుకు ఉద్దేశించిన నాలుగు బిల్లులను పార్లమెంటులో ఆమోదింప చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందనీ, అవి అమల్లోకొస్తే రాష్ట్రాల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి హెచ్చరించారు. ఆదివారం మాంటిస్సోరి కళాశాలలో యుటిఎఫ్‌ ఆధ్వర్యాన జరిగిన రాష్ట్రస్థాయి విద్యా సదస్సులో ఆయన మాట్లాడారు.
ఈ నాలుగు బిల్లుల్లో ఉన్నత విద్యను దెబ్బతీసే అంశాలుఎక్కువగా ఉన్నాయని ఏచూరి అన్నారు. దీనిలో భాగంగా యుజిసి, ఎఐసిటిఇని రద్దుచేసి

స్పందింపజేస్తున్న ఎగ్జిబిషన్‌


సిపిఎం విస్తృత సమావేశాల సందర్భంగా గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణమండపంలో ఏర్పాటుచేసిన ఫొటోఎగ్జిబిషన్‌కు ఆదివారం ప్రజలు తరలివచ్చారు. వర్లీ, తెభాగ, పున్నప్ర వాయలార్‌, ఆంధ్రప్రదేశ్‌లో భూపోరాటం వంటి ఘట్టాలతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది. అణుబాంబుల వల్ల కలిగే నష్టాలను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఏర్పాటు చేసిన అనేక చిత్రపటాలు విద్యార్థులను ఆలోచింపజేస్తున్నాయి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి పట్టణాలపై బాంబు వేసినప్పటి నుండి ఇప్పటి వరకూ అమెరికా చేస్తున్న అనేక దురాగతాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫొటోలు స్పందింపజేస్తున్నాయి. విద్యార్థులు, యువకులు ఎక్కువగా ఈ ఎగ్జిబిషన్‌ను తిలకిస్తున్నారు. సాయంత్రం కళారూపాలు కూడా ఉండటంతో ఎక్కువమంది ఇక్కడకు చేరుకుంటున్నారు. దీంతో ఎగ్జిబిషన్‌ ప్రాంగణం, కళారూపాల ప్రాంగణం వీక్షకులతో నిండిపోయంది.

ప్రజా కళాకారులే సమాజ మార్గదర్శకులు

  • 'జజ్జనకరిజనారే' లో సినీ దర్శకుడు ఉమామహేశ్వరరావు
రాబోయే పరిణామాలను పసిగట్టి సమాజాన్ని మేల్కొలిపే దార్శినికులు కళాకారులేనని సినీ దర్శకుడు సి ఉమామహేశ్వరరావు అభివర్ణించారు. జానపద కళారూపాల సమ్మేళనం నిర్వహిస్తున్న ప్రజానాట్యమండలి కళాకారుల కృషి అభినందనీయమన్నారు. సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల సందర్భంగా ప్రజానాట్యమండలి తలపెట్టిన' జజ్జనకరిజనారే'లో నాల్గోరోజు ఆదివారం సాయంత్రం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రజానాట్యమండలి తొలినుంచీ జానపదకళలకు ప్రాధాన్యత ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రాచీన, వర్తమాన విషయాలను వివరిస్తూ భవిష్యత్తుపై అవగాహన కల్గించడమే

రేయింబవళ్లు శ్రమిస్తూ.. అందరి అభిమానమూ చూరగొంటూ...

  • విస్తృత సమావేశాల జయప్రదానికి సుశిక్షితులైన 800 మంది వలంటీర్ల సేవలు
విజయవాడలో జరుగుతున్న సిపిఎం విస్తృత సమావేశాల విజయవంతానికి సుశిక్షుతులైన 800 మంది వలంటీర్లు రేయింబవళ్లూ శ్రమిస్తూ అందరి అభిమానా లనూ చూరగొంటున్నారు. అరుణశోభ అద్దేందుకు నగరమంతటా పార్టీ జెండాలు, తోరణాలు కట్టారు. ప్రధాన కూడళ్లు, జాతీయ రహదారులపై కటౌట్లు, ఫెక్సీలతో అలంకరించారు. సమావేశాలు జరిగే తుమ్మల పల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రాన్ని (షహీద్‌నగర్‌) రెండు వారాలుగా కష్టపడి తీర్చిదిద్దారు. దేశ నలుమూలల నుండి వచ్చిన పోరాట యోధులకు విమానాశ్రయం, రైల్వేస్టేషన్ల వద్ద ఆహ్వానం పలకడం దగ్గర్నుంచీ వారిని బసకు వాహనాల్లో తరలించడం,

పాలకుల ప్రపంచీకరణ విధానాలతో మహిళలపై పెనుభారం

  •  
  • 'మహిళలు-సోషలిజం' పుస్తకాన్ని ఆవిష్కరించిన బృందా కరత్‌
పాలకులు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు దేశంలోని మహిళలపై పెనుభారాలు మోపుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నేటికీ లింగ వివక్ష కొనసాగటం శోచనీయమన్నారు. సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలను పురస్కరించుకుని విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జర్మన్‌ కమ్యూనిస్టు నేత, జర్నలిస్టు ఔగుస్టు బేబెల్‌ రచించిన 'మహిళలు-సోషలిజం' అనే పుస్తకాన్ని బృందాకరత్‌ ఆదివారం ఆవిష్కరించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.స్వరూపరాణి అధ్యక్షతన జరిగిన

కులాధిపత్యమే 'ఖాప్‌'ల లక్ష్యం

  • రాజకీయ అండదండలతోనే 'కుల దురంహకార హత్యలు'
  • సిపిఎం హర్యానా కార్యదర్శి ఇంద్రజిత్‌
ఖాప్‌ పంచాయితీల ముసుగులో తమ కులాధిపత్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు, సంఘటితం చేసేందుకు హర్యానాలోని అగ్రవర్ణాలు ప్రయత్నిస్తున్నాయని ఆ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి ఇంద్రజిత్‌ వ్యాఖ్యానించారు. సిపిఎం కేంద్ర కమిటీ విస్తృత సమావేశాల నేపథ్యంలో ఈ అంశంపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు...

కాశ్మీర్‌ సమస్య రాజకీయంగానే పరిష్కరించాలికాశ్మీర్‌ సమస్య రాజకీయంగానే పరిష్కరించాలి

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే జటిలం చేసింది
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తరిగామి
లాఠీలు, తూటాలతో కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించాలనుకోవడం అవివేకమే అవుతుందని ఆ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి మహ్మద్‌ యూసఫ్‌ తరిగామి వ్యాఖ్యానించారు. పోలీసు బలగాలతో శాంతిని నెలకొల్పాలన్న ప్రయత్నాలు మరింతగా హింస ప్రజ్వరిల్లడానికి కారణమౌతున్నాయని పేర్కొన్నారు. దేశం లోపల, వెలుపల చర్చల ప్రక్రియ ద్వారా రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించినప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన స్పష్టం చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ విస్తృత సమావేశాల నేపథ్యంలో ఆదివారం ఆయనిక్కడ 

మణిపూర్‌-నాగాలాండ్‌ సమస్య పరిష్కారానికి కేంద్రం చొరవ చూపాలి

  • ఆర్థిక దిగ్బంధనాన్ని తొలగించాలి
  • 'ప్రజాశక్తి' ఇంటర్వ్యూలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు నూరుల్‌ హుడా
కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజా సంఘాలతో చర్చలు జరపటం ద్వారానే మణిపూర్‌-నాగాలాండ్‌ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించవచ్చని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు నూరుల్‌ హుడా అన్నారు. 'గ్రేటర్‌ నాగాలాండ్‌ ఏర్పాటు' డిమాండ్‌తో రెండు నెలలుగా మణిపూర్‌ను ఆర్థికంగా దిగ్భంధనం చేయటం వల్ల అక్కడి ప్రజలు నానాఇక్కట్లు పడుతున్నారని తెలిపారు. దీని వల్ల మణిపూర్‌లో అన్ని రకాల వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయని చెప్పారు. ఈ దిగ్భంధనాన్ని తొలగించి ప్రజలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల్లో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన హుడా  ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏప్రిల్‌ నుండి మణిపూర్‌-నాగాలాండ్‌ మధ్య నెలకొన్న పరిణామాలు, అక్కడి ప్రజల అవస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి తదితర అంశాలను ఆయన వివరించారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలివి..
'గ్రేటర్‌ నాగాలాండ్‌' అనే డిమాండ్‌ ఎందుకు వచ్చిందంటారు?
దీని గురించి తెలుసుకోవాలంటే స్వాతంత్య్ర పూర్వం జరిగిన సంఘటనల గురించి మనం తెలుసుకోవాలి. 1947 కంటే ముందు నాగాలాండ్‌ భారత్‌దేశంలో భాగంగా లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాతనే నాగాలాండ్‌ను భారత్‌లో విలీనం చేశారు. ఆ దశలో ఇషాక్‌ ఛూ, టిహెచ్‌ మ్యూవా అనే ఇద్దరు నాయకులు నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌ (ఎన్‌ఎస్‌సిఎన్‌) అనే సంస్థను నెలకొల్పి విలీనానికి వ్యతిరేకంగా పోరాడారు. ఇది నెహ్రూకాలం నాటి సంగతి. అయితే వారిద్దరు కొద్దికాలం తర్వాత భారత్‌ను వదిలి విదేశాలకు వెళ్లిపోయారు. భారత్‌లో నాగాలాండ్‌ ఒక రాష్ట్రంగా కలిసిపోయిన తర్వాత ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయటం అసంభవమని వారు గుర్తించారు. అందువల్ల ఇప్పుడు 'నాగానీస్‌' భాష మాట్లాడేవారందూ ఒకే రాష్ట్రంగా ఉండాలనేది వారి డిమాండ్‌. నాగాలాండ్‌లోని కొన్ని జిల్లాలతోపాటు మణిపూర్‌లో 'నాగానీస్‌' భాష మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలిపి 'గ్రేటర్‌ నాగాలాండ'్‌ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని మణిపూర్‌లోని అత్యధికులతోపాటు స్వల్ప సంఖ్యలో అక్కడున్న అస్సామీలు, బెంగాలీలు, హిందీ మాట్లాడేవారు, అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన వారు వ్యతిరేకిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లోనూ పలుమార్లు ఆందోళనలు జరిగాయి కదా? వివరిస్తారా?
అవును. గ్రేటర్‌ నాగాలాండ్‌ కోసం 10 సంవత్సరాల నుండి ఆందోళనలు జరుగుతున్నాయి. 2001లో ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో యువతీ యువకులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు కాల్పులు జరిపారు. 18 మంది చనిపోయారు. ఈ యేడాది (2010) ఏప్రిల్‌లో 'గ్రేటర్‌ నాగాలాండ్‌'ను డిమాండ్‌ చేస్తూ 'నాగాలాండ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌', 'ఆల్‌ మణిపూర్‌ నాగా స్టూడెంట్స్‌ అసోసియేషన్స్‌' ఆధ్వర్యాన మణిపూర్‌కు ఎలాంటి నిత్యావసరాలు, వస్తువులు వెళ్లనీయకుండా ఆర్థిక దిగ్భంధనం చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగుతోంది. ఇదే సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్‌ఎస్‌సిఎన్‌ నాయకుడు మ్యూవా మణిపూర్‌లో స్వగ్రామానికి పర్యటిస్తానంటూ ప్రకటించారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో మ్యూవా పర్యటనను అంగీకరించలేమంటూ మణిపూర్‌ ముఖ్యమంత్రి ఓఇబోబి ప్రకటిం చారు. ఆయన రాష్ట్ర సరిహద్దుల్లోకి వస్తే అరెస్టు చేయాలంటూ పోలీసుల్ని ఆదేశిం చారు. నాగా స్టూడెంట్స్‌ మ్యూవాకు మద్దతు పలికారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లోనే మ్యూవా మణిపూర్‌ సరిహద్దుల్లోకి ప్రవేశించటం, సరిహద్దుల్లో నాగా స్టూడెంట్ల ఆందోళన, పోలీసుల కాల్పులు, ఇద్దరు నాగా విద్యార్థులు మరణించటం తదితర సంఘటలన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. పర్యవసానంగా ఇప్పుడు మరింత భయానక పరిస్థితులేర్పడ్డాయి.

ఆర్థిక దిగ్భంధనం నేపథ్యంలో మణిపూర్‌ ప్రజల పరిస్థితులెలా ఉన్నాయి?
వారి పరిస్థితి భయానకంగా ఉంది. ఎన్‌హెచ్‌-39, ఎన్‌హెచ్‌-53 ద్వారా మణిపూర్‌కు నిత్యావసరాలు, సరుకు రవాణా జరుగుతుంది. ఎన్‌హెచ్‌-39 గౌహతి, నాగాలాండ్‌ మీదుగా మణిపూర్‌ వరకు ఉంది. ఎన్‌హెచ్‌-53 గౌహతి, షిల్‌షేర్‌ (అస్సాం) మీదుగా ఇంఫాల్‌ (మణిపూర్‌ రాజధాని) వరకు ఉంటుంది. ఈ రెండింటినీ ఇప్పుడు దిగ్భంధించారు. ఫలితంగా నిత్యావసరాల ధరలు చుక్కలనంటాయి. బ్లాక్‌ మార్కెట్‌ రాజ్యమేలుతోంది. నేను జూలైలో స్వయంగా ఆ రాష్ట్రాన్ని సందర్శించాను. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.70 నుండి 80 వరకూ ఉంది. కిరోసిన్‌ ధర లీటర్‌కు రూ.80 వరకూ ఉంది. దీని వల్ల రవాణా చార్జీలు, ఫలితంగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అసలే వెనుకబడిన రాష్ట్రమైన మణిపూర్‌ ఆర్థికస్థితి ప్రస్తుత పరిస్థితి వల్ల మరింత దిగజారింది.
సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేమిటి?
సమస్యను పరిష్కరించి ప్రజలకు స్వాంతన చేకూర్చాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. పరిష్కారం కనుగొనటంలో అవి రెండూ పూర్తిగా విఫలమయ్యాయి. నేను జూలైలో కేంద్ర హోంమంత్రి చిదంబరాన్ని స్వయంగా కలిసి పరిస్థితి వివరించాను. ఆర్థిక దిగ్భంధనాన్ని తొలగించి ప్రజల్ని రక్షిస్తామన్న ఆయన తన వాగ్ధానాన్ని ఇప్పటికీ నెరవేర్చలేకపోయారు. అవతల రెండు రాష్ట్రాల మధ్య భీతావాహ వాతావరణం రాజ్యమేలుతోంటే ఎలాంటి చర్యలు చేపట్టకుండా హోం మంత్రి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటం శోచనీయం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవటంలో ఘోరంగా విఫలమైంది.
మణిపూర్‌-నాగాలాండ్‌ సమస్యకు సిపిఎంగా మీరెలాంటి పరిష్కారాన్ని చూపిస్తున్నారు?
కేంద్రం చొరవ తీసుకోవటం ద్వారానే సమస్య పరిష్కారమవుతుంది. ఇది తప్ప వేరే మార్గం లేదు. మణిపూర్‌-నాగాలాండ్‌కు చెందిన వివిధ పార్టీల నాయకుల్ని, ప్రజా, స్వచ్ఛంద సంఘాల్ని ఢిల్లీకి పిలిపించుకుని చర్చలు జరపాలి. తద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాలి. దీనికంటే ముందుగా ఆర్థిక దిగ్భంధనాన్ని తొలగించి మణిపూర్‌ ప్రజల్ని రక్షించాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం.

Sunday, August 8, 2010

పాలకుల ప్రపంచీకరణ విధానాలు మహిళలపై పెనుభారం: బృందా కరత్‌

* 'మహిళలు-సోషలిజం' పుస్తకాన్ని ఆవిష్కరించిన బృందా కరత్‌

పాలకులు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు దేశంలోని మహిళలపై పెనుభారాలు మోపుతున్నాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నేటికీ లింగ వివక్ష కొనసాగటం శోచనీయమన్నారు. సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలను పురస్కరించుకుని విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జర్మన్‌ కమ్యూనిస్టు నేత, జర్నలిస్టు ఔగుస్టు బేబెల్‌ రచించిన 'మహిళలు-సోషలిజం' అనే పుస్తకాన్ని బృందాకరత్‌ ఆదివారం ఆవిష్కరించారు.

Saturday, August 7, 2010

పోరాటాలకు స్ఫూర్తిదాయకం

  • ఎగ్జిబిషన్‌ ప్రారంభించిన రాఘవులు
అనేక పోరాటాల సమాచారం,ఫోటోలను ఒకచోట చేర్చి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్ఫూర్తిదాయకంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. దేశంలో పేరెన్నికగన్న వర్లీ ఆదివాసుల తిరుగుబాటు, తెభాగ, ఆంధ్రప్రదేశ్‌ భూ పోరాటాలు, సామ్రాజ్యవాద ప్రమాదాన్ని వివరించే ఎన్నో చిత్రాలను ఇందులో ఏర్పాటు చేశామన్నారు. సిపిఎం విస్తృత సమావేశాల సందర్భంగా స్థానిక గాంధీనగర్లో కందుకూరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు.

సుత్తీ కొడవలి జెండా పేదలకు అండాదండా

  •  
  • అరుణ పతాకావిష్కరణ చేసిన పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం
'సుత్తీ కొడవలి చుక్కా...ఇది పేదల పాలిటి వేగుచుక్కా', 'కనుమూసిన వీరుల్లారా...విప్లవ ధ్రువ తారాల్లారా', 'అమర వీరులకు, జాతి యోధులకు పూలాతో పూజించుదుమా..' అంటూ ప్రజా నాట్య మండలి కళాకారులు గళమెత్తి పాడుతుండగా, 'వర్థిల్లాల్లి మార్క్సిజం- లెనినిజం', 'వర్థిల్లాలి సోషలిజం', 'నశించాలి సామ్రాజ్యవాదం', 'సాధిస్తాం అమరవీరుల ఆశయాలను - సాధిస్తాం, సాధిస్తాం' అని కార్యకర్తలు నినాదాల చేస్తుండగా.. ఎన్నో కమ్యూనిస్టు ఉద్యమ చారిత్రాత్మక ఘట్టాలకు సాక్షీభూతంగా నిలిచిన విజయవాడ (తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రం-షాహిద్‌నగర్‌)లో శనివారం సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు ఉత్సాహపూరిత వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన పోరాట యోధులు వందలాది మంది జెండా చుట్టూ మూడు వరుసల్లో నిలబడి రెడ్‌శాల్యూట్‌ చేస్తుండగా వీర తెలంగాణా సాయుధ పోరాట యోధులు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మల్లు స్వరాజ్యం అరుణపతాకాన్ని ఆవిష్కరించారు.

ఆశయ పథంలో అలుపెరుగని యోధులకు ఎర్రెర్రని దండాలు

  •  
  • సాదర స్వాగతం పలికిన పాటూరు
సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలకు అరుదెంచిన వివిధ రాష్ట్రాల ప్రతినిధులకు (ఆశయపథంలో అలుపెరుగని పోరాట యోధులకు) ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, కేంద్ర కమిటీ సభ్యులు పాటూరు రామయ్య సమావేశ వేదిక నుంచి సాదర స్వాగతం పలికారు. శనివారం ఉదయం పదిన్నర గంటలకు విజయవాడ షహీద్‌నగర్‌ (తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం)లో సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు విజయవాడలో ఏర్పాటుకు అవకాశం కల్పించినందుకు పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్రకమిటీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

మతోన్మాదంపై నికరమైన పోరాటం

ఈ కాలంలో కర్ణాటకలో సిపిఎం వివిధ సమస్యలపై ఉద్యమాలు నిర్వహించింది. ఇదే కాలంలో కర్ణాటకలో బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం స్వతంత్రంగా అధికారంలోకి రావటం ముఖ్యమైన పరిణామం. రాష్ట్రంలో మతోన్మాద శక్తులు పుంజుకున్నాయి. ఆరెస్సెస్‌ నేతృత్వంలోని వివిధ సంస్థలు, సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మతోన్మాద చర్యలు, దాడులు, ధ్వంసాలకు పెద్దఎత్తున పూనుకున్నారు.

ప్రజాకంటక విధానాలపై సమరశీల పోరు

  • కాంగ్రేసేతర లౌకిక పక్షాల సమీకరణ
  • బెంగాల్‌ వామపక్షానికి దేశవ్యాప్త మద్దతు
  • స్వతంత్ర కార్యాచరణతో పార్టీ బలోపేతం
  • సిపిఎం ముసాయిదా రాజకీయ తీర్మానం
దేశంలోని వివిధ తరగతుల ప్రజలపై పెను ప్రభావం చూపెడుతోన్న నూతన ఆర్థిక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని సిపిఎం పిలుపునిచ్చింది. రానున్న కాలంలో ఇదే ప్రధాన కర్తవ్యంగా పనిచేయాలని పార్టీ నిర్ణయించింది. శనివారం ఇక్కడ ప్రారంభమైన కేంద్ర కమిటీ విస్తృత సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌ ముసాయిదా రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ, జాతీయ పరిస్థితిని ముసాయిదాలో వివరించారు. తదుపరి పార్టీ అఖిల భారత మహాసభ సమయం వరకూ అనుసరించాల్సిన రాజకీయ విధానాన్ని పేర్కొన్నారు. రానున్న కాలంలో పార్టీ చేపట్టాల్సిన తక్షణ కర్తవ్యాలను ప్రతిపాదించారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ డొల్లతనం కూడా వెలుగులోకి వచ్చిందని ముసాయిదాలో సిపిఎం అభిప్రాయపడింది. చైనా ఆర్థిక శక్తి పెరిగిందనీ, ఆర్థిక సంక్షోభాన్ని పలు అభివృద్ధి చెందుతోన్న దేశాలు సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయనీ పేర్కొంది. ఈ పరిణామం బహుళధృవ ప్రపంచ ఏర్పాటుకు మార్గం సుగుమం చేసిందనీ అభిప్రాయపడింది. సంక్షోభం నేపథ్యంలో సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయనీ పేర్కొంది. అంతర్జాతీయంగా అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ విధానాలకు వ్యతిరేకంగా, దేశంలో భారత్‌-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడాలని సిపిఎం నిర్ణయించింది. యుపిఎ ప్రభుత్వ నూతన ఆర్థిక విధానాల అమలు తీరు, వివిధ తరగతుల ప్రజలపై పడుతోన్న ప్రభావం తదితర అంశాలను ముసాయిదా తీర్మానంలో సిపిఎం చర్చించింది.

వామపక్షాలే ప్రత్యామ్నాయం

  • ప్రారంభోపన్యాసంలో ప్రకాశ్‌ కరత్‌
  • ఉత్సాహపూరిత వాతావరణంలో సిపిఎం విస్తృత సమావేశాలు ప్రారంభం

నయా ఉదారవాద విధానాలు దేశంలోని అత్యధిక ప్రజానీకం మనుగడకు శ్రేయస్కరం కాదనీ, ప్రత్యామ్నాయ విధానాల అమలు ద్వారానే ప్రజలను రక్షించగలమని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరత్‌ అన్నారు. వామపక్షాలు అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసి చూపుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ విధానాల అమలు కోసం రాజకీయంగా, సాంఘికంగా మార్పుల కోసం వామపక్షాల ఐక్యతను బలోపేతం చేయడం, విశాల ప్రాతిపదికన వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల మద్దతు కూడగట్టడమే మార్గమని స్పష్టం చేశారు. సిపిఎం జాతీయ విస్తృత సమావేశాలు తుమ్మలపల్లి కళాక్షేత్రం (షహీద్‌నగర్‌)లో శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. కరత్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ

అరుణారుణం.. అజరామరం..

 
అరుణారుణం.. అజరామరం..

అరుణారుణమై వెలుగొందుతోంది
అజరామరమై కొనసాగుతోంది
మార్క్స్‌ ఎంగెల్స్‌ల సిద్ధాంత రూపుతో
లెనిన్‌ స్టాలిన్‌ ఆచరణ దీపమైంది

శ్రామికుల రక్తంలో తడిసి
ఎరుపు వర్ణం అద్దుకుంది
పీడిత, శ్రామికులకు గుర్తుగా
కత్తీసుత్తిని చిహ్నంగా చేర్చుకుంది

విప్లవాలు ఉద్యమాలే ఊపిరిగా
విశ్వమంతా విస్తృతమవుతోంది
శ్రామికవర్గ నాయకత్వంలో
సమసమాజ స్థాపనే లక్ష్యమంది

సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమైన
మార్క్సిజం-లెనినిజమే సిద్ధాంతమంది
సోషలిస్టు చైతన్యం నింపుతూ
సమరశీలురుగా తీర్చి దిద్దింది

సామ్యవాద దృక్పథంతో
సామ్రాజ్యవాదాన్ని దునుమాడుతోంది
మతోన్మాదాన్ని అడ్డుకుంటూ
లౌకికతత్వాన్ని నెలకొల్పుతోంది

ఎర్రకోటపై ఎర్రజెండా ఎగిరేసేటందుకు
ఆంధ్రప్రదేశ్‌లోనే సిద్ధాంతం రాసుకుంది
తెలంగాణా పోరాట పటిమతో
సాయుధపోరాటానికి నాంది పలికింది

ముచ్చటగా మూడు రాష్ట్రాల్లో
కొలువుదీరి కూర్చుంది
ప్రత్యామ్నాయ మార్గంతో
ప్రజాప్రయోజనాలు నెరవేరుస్తోంది

ఆటుపోట్లకు అదరకుండా
వేర్పాటు ఉద్యమాలకు ఎదురొడ్డింది
అతివాద పోకడలకు వెరవకుండా
పోరాట పటిమను పెంచుతోంది

ఉద్యమాల పుట్టినింట అగ్రనేతలతో
సిపిఐ(ఎం) సమావేశమవుతుంది
దేశ రాజకీయాలు సమీక్షించి
విజయవాడ వేదికగా వ్యూహరచన చేస్తోంది
- శాంతిశ్రీ

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాలు 11

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాలు 10

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాలు 9

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాలు 8

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాలు 7

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాల ఫొటో 6

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాల ఫొటో 5

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాల ఫొటో 4

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాల ఫొటో 3

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాల ఫొటో 2

సిపిఎం అఖిల భారత విస్తృత సమావేశాల దృశ్యాల ఫొటో 1

ఐక్య ఉద్యమాల ద్వారానే రాజకీయ ప్రత్యామ్నాయం


  • లేకుంటే ప్రజా సమస్యల పరిష్కారం అసాధ్యం
  • తక్షణం కలిసొచ్చే పక్షాలతో ఉద్యమాలు
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు
దేశంలో లౌకిక, ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్మించడం ద్వారా మాత్రమే రాజకీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయగలమనీ, దీనికోసం తమ పార్టీ కృషి చేస్తోందనీ సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. సిపిఎం విస్తృత సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం విజయవాడ చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు.

మీడియా సెంటర్‌ ప్రారంభం


నేటి నుంచి ప్రారంభం కానున్న సిపిఎం విస్తృత సమావేశాలను పురస్కరించుకొని విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌ను పార్టీ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విస్తృత సమావేశాలకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులతోపాటు పశ్చిమ బెంగాల్‌, కేరళ, త్రిపుర ముఖ్యమంత్రులు హాజరుకానున్నారని చెప్పారు. శనివారం ఉదయం 10.30 గంటలకు తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సమావేశాలు ప్రారంభమవుతాయని, అనంతరం ప్రతినిధుల సభ జరుగుతుందని అన్నారు. ఈ నెల 10న భారీ ప్రదర్శనతోపాటు స్వరాజ్య మైదానం (పిడబ్ల్యుడి గ్రౌండ్స్‌)లో బహిరంగ సభ ఉంటుందనీ, సభకు లక్ష మందికిపైగా వస్తారనీ చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య కూడా పాల్గొన్నారు. ఈ సెంటర్‌కు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌.వెంకట్రావు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మీడియా సెంటర్‌ పనిచేస్తుందనీ, మీడియా సెంటర్‌లో కంప్యూటర్‌, ఫ్యాక్స్‌, ప్రింటర్‌, స్కానర్‌ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశామనీ వెంకట్రావు తెలిపారు. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ నెల ఎనిమిదో తేదీ వరకూ సాయంత్రం ఆరు నుంచి పది గంటలవరకూ జింఖానా మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.

సిపిఎం విస్తృత సమావేశాలకు సర్వం సిద్ధం

సిపిఎం విస్తృత సమావేశాలకు సర్వం సిద్ధం

  • ప్రారంభించనున్న ప్రకాశ్‌ కరత్‌
  • విజయవాడకు చేరుకున్న ప్రతినిధులు
  • సాదర స్వాగతం పలికిన నేతలు
  • ఎగ్జిబిషన్‌, మీడియా సెంటర్‌ ప్రారంభం

నేటి నుండి జరిగే సిపిఎం విస్తృత సమావేశాలకు విజయవాడ సర్వం సిద్ధమైంది. శనివారం ఉదయం 10.30 గంటలకు తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సమావేశాలను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కరత్‌ ప్రారంభిస్తారు. సమావేశాల నిర్వహణకు ఆహ్వాన సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. అనంతరం ప్రతినిధుల సభ జరుగుతుంది. మంగళవారం వరకూ జరిగే ఈ సమావేశాల్లో 376 మంది ప్రతినిధులు పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం నగరంలో భారీ ప్రదర్శన, స్వరాజ్య మైదానంలో బహిరంగ సభ ఉంటుంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ కరత్‌, పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య, కేరళ ముఖ్య మంత్రి విఎస్‌ అచ్యుతానందన్‌ శనివారం వస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కార్‌, పలువురు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, సీనియర్‌ నేతలు విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానా శ్రయం లోనూ, విజయవాడ రైల్వేస్టేషన్‌లోనూ వీరికి ఘన స్వాగతం లభించింది.శుక్రవారం మధ్యాహ్నం గన్నవరం విమానా శ్రయానికి త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌, సిపిఎం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర కార్యదర్శి బిమన్‌బసు, మంత్రి నిరు పమ్‌సేన,్‌ కేరళ మంత్రులు పియం కుట్టి, థామస్‌ ఐజాక్‌, యం.విజయకుమార్‌, గురుదాసన్‌, పికె శ్రీమతి, త్రిపుర మంత్రి అనిల్‌ సర్కార్‌ తదితరులు వచ్చారు.

ఇదిలా వుండగా జింఖానా గ్రౌండ్‌లోని కందుకూరి కళ్యాణ్య మండపంలో ఎగ్జిబిషన్‌ను శుక్రవారం సాయంత్రం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ప్రారంభించారు. అనేక పోరాటాల సమాచారం,ఫోటోలను ఒకచోట చేర్చి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ స్ఫూర్తిదాయకంగా ఉందని రాఘవులు అన్నారు. భవిష్యత్తులో సరళీకరణ విధానాలు, సామ్రాజ్యవాద ప్రపంచీ కరణకు వ్యతిరేకంగా పోరాడే శక్తులకు ఈ ఎగ్జిబిషన్‌ మరింత స్ఫూర్తి నింపుతుందన్నారు. మీడియా సెంటర్‌ను సిపిఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.శ్రీనివాసరావు శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ప్రారంభించారు. సమావేశాలకు సంబంధిóంచిన సమా చారాన్ని మీడియా ప్రతి నిధులకు అక్కడి నుంచే రోజూ అంది స్తారు. ప్రజా కళా సంబ రాలు ప్రారంభమైన జింఖానా మైదా నంలో సాంస్కృతిక కార్యక్రమాలు రెండో రోజూ జరిగాయి.