- బెంజిసర్కిల్, కార్పొరేషన్ నుంచి భారీ ప్రదర్శనలు
- ఏర్పాట్లు పూర్తి : వై వెంకటేశ్వరరావు

సిపిఎం విస్తృత సమావేశాల సందర్భంగా మంగళవారం విజయవాడ స్వరాజ్య మైదానం (పిడబ్యుడి గ్రౌండ్స్)లో నిర్వహించనున్న భారీ బహిరంగసభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం పిడబ్ల్యుడి గ్రౌండ్(స్వరాజ్యమైదానం)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడో తేదీ నుండి విజయవాడలో జరుగుతున్న సిపిఎం విస్తృత సమావేశాలు మంగళవారం నాటికి ముగుస్తాయనీ, అనంతరం బహిరంగసభ ఉంటుందనీ వివరించారు. రెండు గంటలకు
బెంజిసర్కిల్ నుంచీ, నగర కార్పొరేషన్ కార్యాలయం నుంచీ ప్రదర్శనలు ప్రారంభమవుతాయని, మధ్యాహ్నం మూడు గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ సభలో సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కరత్, పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర ముఖ్యమంత్రులు బుద్ధదేవ్ భట్టాచార్య, వి.ఎస్.అచ్యుతానందన్, మాణిక్ సర్కార్, పొలిట్‌బ్యూరో సభ్యులు సీతారాం ఏచూరి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు, కేంద్ర కమిటీ సభ్యులు మల్లు స్వరాజ్యం, తమ్మినేని వీరభద్రం, ఎం.ఎ.గఫూర్ ప్రసంగించనున్నారని వివరించారు. సభా ప్రాంగణంలోకి ప్రజలు వచ్చేందుకు నాలుగు ద్వారాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రతినిధులు, మీడియా, సీనియర్ సిటిజన్లకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మిరియం వెంకటేశ్వర్లు, సిహెచ్.బాబూరావు, జాన్‌వెస్లీ, నగర కార్యదర్శి ఆర్.రఘు తదితరులు పాల్గొన్నారు.
మీ అసలు పేరు ఏమిటి? పార్టీలో మీరు ఏ పదవిలో ఉన్నారో కూడా వ్రాయలేదు.
ReplyDeleteఇండియలొ వున్న సి. పి ఐ (యం) సి. పి. యం కమ్మునిస్టు అని పెరు పెట్టు కున్నాఇ కాభట్టి కమ్మునిస్టు పార్టి ఐపొతాయా?? ఆలెక్కన రశ్యా. చైనా కుడా కమ్మినిస్టు పార్టిలె అవుతాఇ (తొలుత విప్లవపంతాలొ పయనించినా తర్వాత తిరొగమనం పట్టె ఇ }వాళ్ళు మతక గుడ్డలు కట్టుకున్నారు కాభట్టి చాలాగొప్ప కమ్మినిస్టులు కదా?దాన్నిభట్టి గద్దర్ కుడా చాల గొప్ప కమ్మినిస్టె ఐవుండాలి బెంగాల్లొ అదికారంలొకి వచ్చి ఏంచెసారు ? భుర్జువా పార్టిలకు ఈకమ్మినిస్టు ముసుగు వెసుకున్న తొడెళ్ళకు తెడా ఏమిటొ చెప్పండి భుర్జూవా పార్టిలు ఓట్ల కొసం ఏలాంటి జిమ్మిక్కులు చెస్తాయొ ఈపార్టిలు కూడా అలాంటి జిమ్మిక్కులె చెస్తా ఇ ఏపార్టితొ లాభం వుంటె ఆపార్టితొ జతకట్టి అదికారంలొకి రావాలని ఆరాటం ఇదెనా మార్కిజం? మార్కిజం ఇదె చెప్పిందా? అలాగైతె కొత్త నిర్వచనం ఇచ్చుకొవాలి ప్రజలు ఇదె కమ్మినిజం ఇదె మార్కిజం అనుకొనివున్నారు ఇలాంటి కమ్మినిజానికి దూరంగా వున్నారు వాళ్ళకు తెలికుండానె మంచి పనిచెస్తున్నారు
ReplyDeleteబ్యానర్ లో మహానాయకుడు స్టాలిన్ ఫొటో పెట్టుకున్నారు.ఒకవేళ స్టాలిన్ బతికి ఉండి బుద్ధదేవ్ భట్టాచార్య లాంటివాళ్లని చూస్తే ఆత్మహత్య చేసుకుంటాడు.
ReplyDelete